Sonia Gandhi : చెకప్ కోసం విదేశాలకు సోనియా గాంధీ
తల్లితో పాటే రాహుల్..ప్రియాంక గాంధీ
Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ ఆరోగ్య పరంగా చెకప్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఇటీవల ఆమె రెండుసార్లు కరోనా బారిన పడ్డారు.
కోలుకున్నాక కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందుకు హాజరయ్యారు. ఇదిలా గతంలో కూడా ఆపరేషన్ కోసం ఆమె అమెరికాకు వెళ్లారు.
తాజాగా మరోసారి జనరల్ చెకప్ లో భాగంగానే సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి విదేశాలకు వెళ్లనున్నట్లు సమాచారం. సోనియా గాంధీ వెంట కుమారుడు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ వాద్రా కూడా వెళ్లనున్నారు.
ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్ జైరాం రమేష్. కాగా నిర్దిష్టమైన ప్రయాణానికి సంబంధించిన తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
అయితే రాహుల్ గాంధీ సెప్టెంబర్ 4న కాంగ్రెస పార్టీ ఆధ్వర్యంలో జరిజగే మెహంగై పర్ హల్లా బోల్ ర్యాలీలో ప్రసంగిస్తారని చెప్పారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ తరుణంలో సోనియా గాంధీ ఉన్నట్టుండి విదేశాలకు వెళ్లడం ఒకింత ఇబ్బందిగా మారనుంది.
ఇది కూడా పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముందే చోటు చేసుకోవడం విశేషం. నోటిఫికేషన్ ఈ వారంలోనే వెలువడనుందని సమాచారం.
ప్రస్తుతం సోనియా టూర్ పై ఉత్కంఠ నెలకొంది పార్టీ శ్రేణులలో.
Also Read : హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కరోనా