Sonia Gandhi : ఈడీ ముందుకు సోనియా గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో హాజరు
Sonia Gandhi : నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ గురువారం హాజరు కానున్నారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇందుకు గాను సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని ఇప్పటికే దర్యాప్తు సంస్థ విచారించింది.
కంటిన్యూగా విచారించినా ఎక్కడా రాహుల్ తడబడ లేదు. ఇదే సమయంలో ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉండగా సోనియా గాంధీకి కరోనా ఎఫెక్ట్ కావడంతో రెస్ట్ తీసుకున్నారు.
ఆస్పత్రి నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఈడీ నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీ విచారణ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దేశ రాజధానికి చేరుకున్నాయి. సోనియా గాంధీ(Sonia Gandhi) ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి బయలు దేరుతారు.
ఏఐసీసీ ఆఫీస్ బేరర్లు, ఫ్రంట్ సంస్థల సభ్యులు సంఘీభావంగా ఆమెతో పాటు వస్తారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. అగ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా మోదీ, షా ద్వయం విప్పిన రాజకీయ ప్రతీకారం కొనసాగుతోంది.
దేశమంతటా సోనియా గాంధీకి(Sonia Gandhi) సామూహిక సంఘీభావాన్ని ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు సీనియర్ నాయకుడు జైరాం రమేష్.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఐదు రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది. ఒక్కో సెషన్ లో 10 గంటల నుంచి 12 గంటల దాకా కొనసాగింది.
మీరు ఎలా ప్రశాంతంగా ఉండగలుగు తున్నారంటూ ఈడీ అధికారులు ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ నవ్వుతూ తాను విపసనా ధ్యానం చేస్తానని చెప్పారు.
Also Read : భారత రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు నేడే