Sonia Gandhi : ఐదు రాష్ట్రాలలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని రీతిలో ఓటమి మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ (Congress Party). 140 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర (Political History) కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే ఢిల్లీ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీలో పలు అంశాలపై చర్చకు వచ్చాయి. ప్రధానంగా ఓటమికి బాధ్యత వహిస్తూ గాంధీ ఫ్యామిలీ (The Gandhi Family) రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరిగింది.
ఓ వర్గం గాంధీ కుటుంబానికి విధేయత కనబరిస్తే మరో వర్గం వ్యతిరేకంగా మారి పోయింది. జ23 టీంకు గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) నేతృత్వం వహిస్తుండగా ఆయనకు మద్దతుగా ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ స్వరం పెంచారు.
గాంధీ ఫ్యామిలీ (The Gandhi Family) వెంటనే రాజీనామా చేయాలని, స్వచ్చంధంగా తప్పు కోవాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలో సోనియా గాంధీకి (Sonia Gandhi)బాసటగా నిలిచారు మరికొందరు నేతలు.
మేడం నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ (Congress Party) నడవాలని, అవకాశవాదులను ఏరి వేయాలని పిలుపునిచ్చారు వీరప్ప మొయిలీ (Veerappa Moily). కపిల్ సిబల్ పై నిప్పులు చెరిగారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్.
తాజాగా అసెంబ్లీ ఫలితాలకు బాధ్యత వహిస్తూ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, ఉత్తర ప్రదేశ్ , పంజాబ్ రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెంటనే రాజీనామాలు సమర్పించాలని ఆదేశించారు ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.
ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి (National Spokesperson) రణ్ దీప్ సూర్జేవాలా వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇటీవలే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ సిద్దూ కూడా ఉండడం విశేషం.
Also Read : సిబల్ కామెంట్స్ ఠాగూర్ సీరియస్