Sonia Gandhi : కాంగ్రెస్ జెండా సమస్యలే ఎజెండా
స్పష్టం చేసిన ఏఐసీసీ చీఫ్ సోనియా
Sonia Gandhi : ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దేశం అభివృద్దిలో వెనక్కి వెళుతోందని, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెరిగిందన్నారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో శుక్రవారం నవ్ సంకల్ప్ చింతన్ శివిర్ ను ఆమె ప్రారంభించి ప్రసంగించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు 400 మంది సీనియర్ నాయకులు, ప్రతినిధులు హాజరయ్యారు.
అంతకు ముందు రాహుల్ గాంధీ తో పాటు 70 మంది నాయకులతో కలిసి రైలులో ఢిల్లీ నుంచి ఉదయ్ పూర్ కు వచ్చారు. ఉదయ్ పూర్ పూర్తిగా కాంగ్రెస్ మయం అయ్యింది. ఎక్కడ చూసినా హోర్డింగ్ లు, కార్యకర్తలు, నాయకులతో హోరెత్తింది.
ఇక చింతన్ బైటక్ ను ఉద్దేశించి సోనియా గాంధీ(Sonia Gandhi) సీరియస్ కామెంట్స్ చేశారు. సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ మనది. దీనిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు.
ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ను కడిగి పారేశారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, అచ్చే దిన్ , మన్ కీ బాత్ పేరుతో జనం చెవుల్లో పూలు పెడుతున్న మోదీ సర్కార్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని కోరారు సోనియా గాంధీ(Sonia Gandhi). ప్రధానంగా ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి దిశా నిర్దేశం చేసిన మాజీ ప్రధాని నెహ్రూను తూల నాడారు.
ఆపై దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్న గాడ్సేను కీర్తిస్తున్నారు. ఇదేనా మీరు ఈ దేశానికి చెబుతున్న నీతి అంటూ నిప్పులు చెరిగారు.
మొత్తంగా కులం, మతం, వర్గం,, ప్రాంతం పేరుతో దేశాన్ని చీల్చాలని చూస్తున్నారంటూ ఆరోపించారు సోనియా గాంధీ. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమన్నారు.
ఇదే సమయంలో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియ చేయాలని కోరారు. మన పని తీరును ఎప్పటికప్పుడు మార్చు కోవాలని సూచించారు. భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఒకే మాట ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు.
Also Read : అమిత్ షాకు పొన్ముడి స్ట్రాంగ్ కౌంటర్