Sonia Gandhi : సోనియా గాంధీ ఆరోగ్యం పదిలం
ఫాలో అప్ ప్రోసీజర్ ఆపరేషన్
Sonia Gandhi : ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ శ్వాస కోశ ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నారు. ఆమె శ్వాస కోశ వ్యాధితో బాధ పడుతుండడంతో వెంటనే ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. ఇతర పోస్ట్ కోవిడ్ లక్షణలు ఉన్నాయని సమాచారం.
ఇదిలా ఉండగా సోనియా గాంధీ(Sonia Gandhi) ముక్కు నుండి విపరీతమైన రక్త స్రావం కావడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఆమెకు ఫాలో అప్ ప్రొసీజర్ చేశారని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వెల్లడించింది.
అడ్మిట్ అయ్యాక సోనియా గాంధీకి శ్వాస కోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు కనుగొన్నారని తెలిపారు పార్టీ కమ్యూనికేషన్ వింగ్ చీఫ్ జై రామ్ రమేష్. ఈనెల 2న సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ అని తేలింది.
12న ముక్కు నుండి రక్తం కారడంతో ఆస్పత్రి లో చేర్చామని తెలిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు జైరాం రమేష్.
ఇదిలా ఉండగా కొడుకు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ క్రమం తప్పకుండా సోనియా గాంధీ(Sonia Gandhi) తో ఉన్నారని పేర్కొన్నారు. గురువారం ఈడీతో విచారణ అనంతరం తన తల్లి వద్దనే ఉన్నారు.
ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ విచారించింది రాహుల్ గాంధీని. శుక్రవారం కూడా హాజరు కావాల్సి ఉండగా తన తల్లికి అనారోగ్యం కారణంగా తాను రాలేనట్లు తెలిపారు గాంధీ.
కాగా ఇదే కేసుకు సంబంధించి సోనియా గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అనారోగ్యం కారణంగా తాను రాలేనని తెలిపింది. ఈనెల 23 వరకు గడువు ఇచ్చింది ఈడీ.
Also Read : పేరుకే ‘పెద్దలు’ నేర చరిత్రలో ముదుర్లు