Sonia Gandhi : దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ తరుణంలో ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రధానంగా అధికారంలో ఉన్న పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఓడి పోవడానికి గల కారణాలపైనే మేడం ఫోకస్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇందులో భాగంగా సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్ అమరీందర్ సింగ్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించడం తప్పేనని ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) పేర్కొన్నారు. ఆయన తొమ్మిది ఏళ్ల పాటు సీఎంగా పంజాబ్ లో కొలువుతీరారు.
కెప్టెన్ బాధ్యతా రాహిత్యం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఓటమికి ప్రధాన కారణంగా విశ్లేషించినట్లు టాక్. ఎన్నికల కంటే ముందు పార్టీ హైకమాండ్ దళిత సామాజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్నీని సీఎంగా చేసింది.
పీసీసీ చీఫ్ గా సిద్దూకు పగ్గాలు అప్పగించింది. ఇక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరించారు. కానీ పార్టీ గతంలో కంటే పూర్తిగా నిరాశజనకంగా ఫలితాలను సాధించింది.
అమరీందర్ సింగ్ , సిద్దూల మధ్య ఆధిపత్య పోరు, చన్నీ, సిద్దూ మధ్య అవగాహన రాహిత్యం చివరకు పార్టీకి పట్టు కోల్పోయేలా చేసిందని సీనియర్లు కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం.
ఇదే సమయంలో సోనియా గాంధీ కల్పించుకుని కెప్టెన్ అమరీందర్ సింగ్ ను సీఎంగా కొనసాగించడం తాను చేసిన పెద్ద తప్పిదమని ఒప్పుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా కెప్టెన్ తన పదవికి రాజీనామా చేయడంతో పాటు కొత్త పార్టీ పెట్టారు. ఆయన పాటియాలా నుంచి ఓటమి పాలయ్యారు. మొత్తంగా పార్టీ కొంప మునిగింది.
Also Read : బ్యాలెట్ అయితే ఎస్పీ గెలిచేది