Sonia Walkout : సోనియా ఆధ్వర్యంలో సభ్యులు వాకౌట్
సరిహద్దు వివాదం విపక్షాలు ఆగ్రహం
Sonia Walkout : భారత , చైనా సరిహద్దులో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి పార్లమెంట్ లో చర్చించక పోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో సభ్యులు వాకౌట్(Sonia Walkout) చేశారు. ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం అనుమతించడం లేదని పేర్కొన్నారు.
1962లో భారత దేశం, చైనా యుద్దం జరిగిన సమయంలో ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఈ సభలో 165 మంది సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని అన్నారు సోనియా గాంధీ. ఏం చేయాలనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకున్నారని అన్నారు ఎంపీ అధిర్ రంజన్ చౌదరి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు వాకౌట్ చేశారు.
భారత్ , చైనా సరిహద్దు వివాదంపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే దీనికి సంబంధించి చర్చించాలని కోరారు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి. కాంగ్రెస్ నేత డిమాండ్ పై స్పందించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా స్పీకర్ సభా కార్యకలాపాలను కొనసాగిస్తుండగా కాంగ్రెస్, టీఎంసీ ఎంపీలు అడ్డు చెప్పాయి. తీవ్ర నిరసనకు దిగాయి. ఎంతకూ స్పీకర్ ఒప్పుకోక పోవడంతో తాము సమావేశాలను వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు ఎంపీలు.
అంతకు ముందు వివిధ అంశాలపై నిరసన తెలుపుతూ విపక్ష సభ్యులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదే సమయంలో టీఎంసీ ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయ కూడా సభలో చర్చకు డిమాండ్ ను లేవనెత్తారు.
Also Read : బీహార్ సీఎం పనై పోయింది – మోదీ