Sonia Gandhi : మహిళా బిల్లు రాజీవ్ కల – సోనియా
స్పష్టం చేసిన సీపీపీ చైర్ పర్సన్
Sonia Gandhi : న్యూఢిల్లీ – నూతన పార్లమెంట్ సాక్షిగా కేంద్ర సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టింది. దీనిపై చర్చ కొనసాగింది. ఈ సందర్బంగా ఏఐసీసీ మాజీ చీఫ్ ,సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా బిల్లుకు సంబంధించి చర్చలో పాల్గొన్నారు.
Sonia Gandhi Words about Rajiv Gandhi
రాజకీయాలతో సంబంధం లేకుండా తాము మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలియ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం వాడుకోవద్దని సూచించారు సోనియా గాంధీ.
2010లోనే తాము రాజ్యసభలో మహిళా బిల్లును ప్రవేశ పెట్టడం జరిగిందని గుర్తు చేశారు సీపీపీ చైర్ పర్సన్. అయితే తన భర్త, దివంగత దేశ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ శ్వాస ఉన్నంత దాకా మహిళల కోసం ప్రయారిటీ ఇస్తూ వచ్చారని తెలిపారు.
ఆయన ముందు చూపుతో వ్యవహరించడం వల్లనే ఇవాళ దేశంలో టెక్నాలజీ రంగం విస్తరించిందని చెప్పారు సోనియా గాంధీ. ఆనాడే టెలికాంలో మార్పులు చోటు చేసుకుంటాయని గుర్తించారని , అందుకే తను అన్ని రంగాలలో మహిళల పాత్ర ఉండాలని కోరుకున్నారని తెలిపారు.
సాధ్యమైనంత త్వరలో అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత, ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు సోనియా గాంధీ.
Also Read : Actor Navdeep : సహకరిస్తే ఓకే లేదంటే అరెస్ట్