Sonia Gandhi : న్యాయ వ్య‌వ‌స్థ‌పై కేంద్రం పెత్త‌నం – సోనియా

న్యాయ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేస్తున్నారా

Sonia Gandhi : కేంద్ర స‌ర్కార్ న్యాయ వ్య‌వ‌స్థ‌పై పెత్త‌నం చెలాయించాల‌ని అనుకుంటోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయ‌కురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) . ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ప్ర‌ధానంగా న్యాయ వ్య‌వ‌స్థ‌పై పెత్త‌నం కోసం మోదీ ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు.

ఇప్ప‌టికే దేశంలోని అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ వ‌చ్చిన బీజేపీ ప్ర‌భుత్వం ఉన్న ఒక్క దానిని కూడా త‌మ నియంత్ర‌ణ‌లోకి తీసుకు రావాల‌ని అనుకుంటోంద‌ని అన్నారు. అందులో భాగంగానే కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప‌దే ప‌దే అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నార‌ని మండిప‌డ్డారు సోనియా గాంధీ.

ప్ర‌స్తుతం ఈ దేశంలో న్యాయ వ్య‌వ‌స్థ ఒక్క‌టే ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉంద‌ని కానీ దానిని కూడా దూరంగా ఉంచాల‌ని ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇదిలా ఉండ‌గా పార్ల‌మెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇక నుంచి బెయిళ్లు , ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యాల‌ను బంద్ చేయాల‌ని , పేరుకు పోయిన కేసుల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

ఆపై న్యాయ వ్య‌వ‌స్థ‌లో న్యాయ‌మూర్తుల పోస్టులు భ‌ర్తీ కాక పోవ‌డానికి కొలీజియం వ్య‌వ‌స్థే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. దీనిపై న్యాయ వ్య‌వ‌స్థ‌, న్యాయమూర్తులు, న్యాయ‌వాదులు తీవ్ర స్థాయిలో అభ్యంత‌రం తెలిపారు.

కేంద్ర మంత్రిపై నిప్పులు చెరిగారు. దీనిపై తీవ్రంగా స్పందించారు సోనియా గాంధీ. మోదీ స‌ర్కార్ కు మూడింద‌ని మండిప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా సోనియా చేసిన కామెంట్స్ పై రాజ్య‌స‌భ చైర్మ‌న్ , ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్.

Also Read : సోనియా కామెంట్స్ స‌త్య‌దూరం

Leave A Reply

Your Email Id will not be published!