Sonia Gandhi : ఉపాధి హామీ ప‌థ‌కంపై నిర్ల‌క్ష్యం

మండిప‌డిన సోనియా గాంధీ

Sonia Gandhi  : కాంగ్రెస్ (Congress) ప్ర‌భుత్వ హ‌యాంలో ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం పై కేంద్ర స‌ర్కార్ నిర్ల‌క్ష్యం వ‌హిస్తోందంటూ ఆ పార్టీ (Congress) తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi )ఇవాళ ఆరోపించారు.

పార్ల‌మెంట్ సాక్షిగా ఆమె మోదీ (Modi) స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. కొన్ని ఏళ్ల కింద‌ట ఉపాధి హామీ ప‌థ‌కం గురించి త‌క్కువ చేసి మాట్లాడారు.

కానీ ఇదే ప‌థ‌కం క‌రోనా క‌ష్ట కాలంలో కోట్లాది మందికి ఉపాధి క‌ల్పించింద‌ని, క‌డుపులు నింపేలా చేసింద‌ని చెప్పారు సోనియా గాంధీ(Sonia Gandhi ). గ్రామీణ ప్రాంతాల‌లో ప‌నులు పూర్తి అయ్యేందుకు ఈ ప‌థ‌కం ఎంత‌గానో ఉప‌యోగ ప‌డింద‌ని అన్నారు.

అయితే స‌ర్కార్ కావాల‌ని ప‌నులు చేసిన వాళ్ల‌కు బిల్లులు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు సోనియా గాంధీ (Sonia Gandhi) . రాను రాను కేంద్ర బ‌డ్జెట్ (Budget) లో కోత విధిస్తూ వ‌స్తున్నార‌ని ఆరోపించారు. ఈ ఏడాది మ‌రీ త‌క్కువ‌గా కేటాయించార‌ని పేర్కొన్నారు.

గ‌తంలో 2020లో ఉపాధి హామీ ప‌థ‌కానికి కేటాయించిన బ‌డ్జెట్ (Budget) తో పోలిస్తే 35 శాతం త‌క్కువ‌గా ఉంద‌న్నారు. ప‌ని చేసిన వారికి కూలీ ల డ‌బ్బులు చెల్లించ‌కుండా తాత్సారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

రూ. 5, 000 వేల కోట్ల విలువైన బ‌కాయిలు పెండింగ్ లో ఉన్నాయంటూ ఆరోపించారు సోనియా గాంధీ. సామాజిక ఆడిట్ ల‌ను ప‌టిష్టం చేయ‌కుండా బిల్లుల‌ను మంజూరు చేయ‌కుండా ఆపితే ఎలా అని నిల‌దీశారు.

దీనిపై స్పందించారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఉపాధి హామీ కింద ప‌ని చేసిన వారి ఖాతాల్లో డ‌బ్బులు నేరుగా జ‌మ చేస్తున్న‌ట్లు చెప్పారు.

Also Read : సీఎం యోగితో ‘శివపాల్’ ములాఖ‌త్

Leave A Reply

Your Email Id will not be published!