ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె లోక్ సభలో సామాజిక మాధ్యమాలపై సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా (Social Media) అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూడడం లేదంటూ ఆరోపించారు.
వ్యతిరేక ప్రచారం (Propaganda) చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. సోషల్ మీడియాను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
లోక్ సభలో జీరో అవర్ సందర్భంగా సోనియా గాంధీ (Sonia Gandhi) మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్బంగా ఇందుకు ఉదాహరణగా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఆల్ జజీరా, ది రిపోర్టర్స్ కలెక్టివ్ లలో ప్రచురించిన సోషల్ మీడియా (Social Media) వింత పోకడలకు సంబంధించిన రిపోర్టు నివేదికను ప్రస్తావించారు.
ఇతర రాజకీయ పార్టీల కంటే ఫేస్ బుక్ ఎన్నికల యాడ్స్ కోసం భారతీయ జనతా పార్టీకి మాత్రమే తక్కువ ధరలో డీల్ కుదుర్చుకుందంటూ సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగ వ్యవస్థ కలిగిన మన దేశంలో సోషల్ మీడియా (Social Media) జోక్యాన్నితగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమాలు వింత పోకడలు పోతున్నాయని వీటిని నియంత్రించక పోతే ప్రమాదమని సూచించారు. ఏ పార్టీ అయినా సరే వాటికి కొన్ని రూల్స్ ఉంటయాని, ఆ మేరకు తమ పని తాము చేసుకుంటూ వెళతాయని తెలిపారు.
దీనిని సీరియస్ అంశంగా పరిగణించాలని సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రధాని మోదీని కోరారు.