Sonia Gandhi ED : సోనియా గాంధీపై ఈడీ ప్రశ్నల వర్షం
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ
Sonia Gandhi ED : నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో మనీ చేతులు మారిందన్న ఆరోపణలపై ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు.
సోనియా గాంధీ వెంట కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు. దేశ రాజధానిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
దేశ వ్యాప్తంగా సోనియా గాంధీకి(Sonia Gandhi ED) మద్దతుగా సంఘీభావం తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కావాలని కక్ష గట్టి వేధింపులకు గురి చేస్తోందంటూ ఆరోపించారు.
75 ఏళ్ల వయస్సు కలిగిన సోనియా గాంధీని విచారణకు హాజరైన తొలి రోజున మూడు గంటల పాటు ప్రశ్నించింది. మరో రెండు రోజుల్లో ఆమెను మరో దఫా విచారణకు పిలిచే అవకాశం ఉందని ఈడీ అధికారులు స్పష్టం చేశారు.
కోవిడ్ నుండి ఇటీవలే కోలుకున్నారు సోనియా గాంధీ. కోవిడ్ ప్రోటోకాల్ ను దృష్టిలో పెట్టుకుని కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తో విచారణకు హాజరయ్యరు. సోనియాను ఒక మహిళా అడిషనల్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు అదికారులు విచారించినట్లు సమాచారం.
మధ్యాహ్నం తర్వాత ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. కాగా ప్రియాంక గాందీని ప్రశ్నించే గదికి దూరంగా భవనంలో ఉండేందుకు అనుమతించారు.
ఒకవేళ ఆరోగ్య సమస్య తలెత్తితే తన తల్లికి ఆమె మందులు ఇవ్వవచ్చని తెలిపారు. దర్యాప్తు సంస్థ చర్యను తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్ పార్టీ.
Also Read : సోనియా గాంధీని ప్రశ్నిస్తున్న ఈడీ