Sonia Gandhi : పీకే పాత్రపై మేడమ్ దే తుది నిర్ణయం
పార్టీలోకి ఎంట్రీ ఇస్తారా లేదా అన్నది వెయిటింగ్
Sonia Gandhi : దేశ వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది. అది ఏమిటంటే ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేక వెనుక నుంచి స్ట్రాటజిస్ట్ గా పని చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాబోయే 2024లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు ఓ రూట్ మ్యాప్ సిద్దం చేశాడు. ఈ మేరకు సదరు బ్లూ ప్రింట్ ను ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) చేతిలో పెట్టారు.
ఎలాంటి మార్పులు తీసుకు రావాలి. ఏమేం చేస్తే తిరిగి కాంగ్రెస బలపడుతుంది. అందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే తదితర విషయాల్నింటిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటికే సమర్పించాడు.
ఈ వారం రోజుల్లో ఏకంగా ప్రశాంత్ కిషోర్ సోనియాను కలవడం ఇది మూడోసారి కావడం విశేషం. పీకే సమావేశంలో కీలక నేతలు కూడా ఉన్నారు. సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,
అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్ , మల్లికార్జున్ ఖర్గే, తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మొత్తం 594 సీట్లకు గాను దేశంలో 370 సీట్లకు కాంగ్రెస పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని మిగతా చోట్ల ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని సూచించినట్లు సమాచారం.
ఈ సమయంలో మేడం సోనియా గాంధీ ప్రశాంత్ కిషోర్ ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించిందని దీనికి ఇంకా పీకే చెప్పలేదని సమాచారం. మొత్తంగా పీకే చేరుతారా లేదా అన్నది తేలాలంటే సోనియా గాంధీ తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.
Also Read : బీజేపీపై శివసేన ఆగ్రహం