#SonuSoodActor : పేదల పాలిట దేవుడు..దేశం మెచ్చిన ధీరుడు
అటు అభిమానుల్లో ఇటు సామాన్య ప్రజల్లో మరిచి పోలేని రీతిలో సంచలనం కలిగించిన ఒకే ఒక్క నటుడు ఎవరైనా ఉన్నారంటే అతనే విలక్షణమైన మేనరిజంతో అలరిస్తున్న సోనూ సూద్. తాజాగా గూగూల్ లో కోట్లాది మంది ఎక్కువగా సెర్చ్ చేసిన పదం ఏదైనా ఉందంటే అదే ఈ యాక్టర్ గురించే.
ప్రపంచాన్ని ప్రభావితం చేసే రంగాలలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్రను పోషించేది మాత్రం ఒకే ఒక్కటి అదే సినిమా. అటు హాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ దాకా కోట్లాది మంది ఈ పరిశ్రమను నమ్ముకుని బతుకుతున్నారు. కొందరు తెర మీద నటించి మెప్పిస్తే..ఇంకొందరు రీల్ లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా తాము హీరోలమేనంటూ తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ల కోవలో ఎందరో తమదైన ముద్రను ఇప్పటికే పొంది వున్నారు. అలాంటి వారిలో కొందరు మాత్రమే జనాన్ని సమ్మోహితులను చేస్తూ..వారి గుండెల్లో పదిలమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే లెక్కించలేనంత వ్యక్తులు నటీనటులు లోకానికి తెలియకుండా గుప్త దానాలు చేసిన వారున్నారు. ఆపత్కాల సమయాల్లో మీకంటూ మేమున్నామంటూ కోట్లాది రూపాయలు విరాళాలు, వస్తువుల రూపేణా అందజేసిన వారు లేక పోలేదు.
ఇండియా అంటేనే మొదట గుర్తుకు వచ్చేది బాలీవుడ్ అంటే హిందీ చిత్ర పరిశ్రమ. ఆ తర్వాతే ఏదైనా. దక్షిణాదిన సినిమా రంగానికి రాను రాను ఎదురే లేకుండా పోయింది. సినిమా అంటేనే అతి పెద్ద రిస్క్. కోట్లాది రూపాయలతో సంబంధం కలిగిన ప్రభావితమైన రంగం. ఇక ప్రత్యేకించి అటు అభిమానుల్లో ఇటు సామాన్య ప్రజల్లో మరిచి పోలేని రీతిలో సంచలనం కలిగించిన ఒకే ఒక్క నటుడు ఎవరైనా ఉన్నారంటే అతనే విలక్షణమైన మేనరిజంతో అలరిస్తున్న సోనూ సూద్. తాజాగా గూగూల్ లో కోట్లాది మంది ఎక్కువగా సెర్చ్ చేసిన పదం ఏదైనా ఉందంటే అదే ఈ యాక్టర్ గురించే. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా కరోనా మహమ్మారితో కోట్లాది ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలో సైతం రోజుకు వేలాది మంది దీని బారిన పడుతున్నారు.
బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ ఇలా ప్రతి చోటా నటీనటులు, సినిమా ఆర్టిస్టులు సైతం తమకు తోచిన రీతిలో బాధితులకు అండగా నిలుస్తూ వస్తున్నారు. చాలా మంది హీరోలు, హీరోయిన్లు తమ ఇళ్లకే పరిమితమై పోతే..సోనూ సూద్ మాత్రం తన వంతు బాధ్యతగా తాను సంపాదించిన కోట్లాది రూపాయలను దానం చేస్తూ వస్తున్నారు. సమాజం అంటే..దేశం అంటేనే మట్టి..మనుషులు..మనసుల సమూహం. జీవితం చాలా చిన్నది. ఉన్నదాంట్లో పంచాలి. ఎంత ఇవ్వగలిగితే అంత మంచిది అన్న అభిప్రాయం కలిగిన వ్యక్తి ఈ హీరో. ఎలాంటి భేషజాలకు పోకుండా, ఎక్కడా ఆధిపత్యాన్ని ప్రదర్శించకుండా..తాను సెలబ్రెటీనన్న కించిత్ గర్వాన్ని ప్రదర్శించకుండా సాదా సీదాగా తనకు తోచిన రీతిలో సహాయం చేసుకుంటూ వెళుతున్నారు ఈ మనసున్న నటుడు.
కళామతల్లి నన్ను ఇంతటి వాడిని చేసింది. నేను పొందిన దాంట్లోంచి ఎంతో కొంతనైనా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలన్నది ఆయన అభిమతం. ఈ దేశంలో లెక్కకు మించి హీరోలున్నారు. కోట్లాది రూపాయలు, ఆస్తులు కలిగి ఉన్నారు. కానీ ఏ ఒక్కరు ఈ విపత్కర, ఆపత్కాల సమయాల్లో స్పందించిన దాఖలాలు లేవు. ఆయా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం తప్పితే తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న క్రమంలో సోనూ సూద్ కోట్లాది ప్రజల ఆశలకు ప్రాణం పోశాడు. దిక్కు లేని వారికి, సమాజం నిర్లజ్జగా వదిలేసిన వారిని, అనాధలు, అన్నార్తులు, కూటికి లేక అల్లాడిపోతున్న లక్షలాది జనానికి అతడు పెద్ద దిక్కయ్యాడు.
ఎక్కడ ఏ సమస్య వచ్చినా లేదా తన దృష్టికి వచ్చినా సరే తక్షణమే స్పందించడం..వెంటనే వారికి సహాయం అందజేయడం చేస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ హీరోగా వినుతికెక్కాడు. తాను కొనుగోలు చేసిన భవనాలను కరోనా బాధితుల కోసం ఇచ్చేశాడు. నిలువ నీడ లేక అల్లాడుతున్న వేలాది వలస కార్మికులు, ప్రజలకు నేనున్నాంటూ మీకేం కాదంటూ తానే కదన రంగంలోకి దూకాడు. ఏకంగా బస్సుల్లో వారి వారి గమ్య స్థానాలకు చేర్చేలా తన స్వంత డబ్బులతో ఏర్పాటు చేశాడు. అంతేనా ఏపీలో ఆర్థికంగా చితికి పోయిన పేద రైతు దుస్థితికి చలించాడు. తానే కొనుగోలు చేసి ట్రాక్టర్ ను అందజేశాడు. పిల్లల చదువు కోసం విరాళాలు ఇచ్చాడు. ఎక్కడ ఎవరికి ఏ సాయం కావాలన్నా తనను నేరుగా సంప్రదించాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చాడు.
ఇపుడు ఆయన అకౌంట్ కు రోజూ లక్షలాదిగా వినతులు వస్తున్నాయి. విజ్ఞప్తులు అందుతున్నాయి. సంపాదించడం కంటే సహాయం చేయడంలో ఉన్నంత తృప్తి ఇంకెందులోనూ ఉండదంటాడు సోనూ సూద్. తెర మీద విలన్ కేరక్టర్ చేసిన ఈ అరుదైన నటుడు తాను వెరీ వెరీ స్పెషల్ అంటూ చెప్పకనే చెప్పాడు. పంజాబ్ కు చెందిన ఈ యాక్టర్ మొదట నాటకాలు వేశాడు. ఆ తర్వాత హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించాడు. అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతి నాయకుడి పురస్కారాన్ని అందుకున్నాడు. ఇండియాలో మోదీ తర్వాత అత్యంత జనాదరణ కలిగిన వ్యక్తిగా ప్రస్తుతం సోనూ సూద్ నిలిచారు. ఒక భారతీయుడిగా పుట్టినందుకు నేను ఈ మట్టికి ప్రణమిల్లుతున్నాను. నాకు పట్టెడన్నం పెట్టి నన్ను బతికిస్తున్న ఈ కళామతల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
నేను వృత్తి పరంగా నటుడినే కావచ్చు..కానీ ప్రవృత్తి పరంగా నేను మనిషిని. ఆస్తులు, అంతస్తులు ఎంత మాత్రం కొలమానాలు కావు. ఉన్నదాంట్లో ..కలిగిన దాంట్లోంచే నేను నా శక్తి మేర ఎంత చేయగలనో అదే చేస్తున్నాను. నేను మీరనుకున్నట్లు గొప్ప వ్యక్తిని కాదు..సామాన్యుడిని. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు. అంతకంటే ఎక్కువగా సాయపడే గుణాన్ని నాకిచ్చారు. కన్నవారికి..ఆ దేవుడికి నేను సర్వదా రుణపడి ఉంటాను. ఇంతకంటే నేనేం చెప్పలేనంటున్నారు సోనూ సూద్. వీలైతే అతడిని ప్రేమిద్దాం. ఇలాంటి హీరోలు మనకున్నందుకు..మన మధ్యనే ఉంటున్నందుకు గర్వపడదాం..!
No comment allowed please