Sourav Ganguly : ఆదుకోవ‌డంలో దీదీ సూప‌ర్ – దాదా

ప్ర‌శంస‌లు కురిపించిన బీసీసీఐ చీఫ్

Sourav Ganguly :  భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ ) చీఫ్ సౌర‌వ్ గంగూలీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న‌ను స్వ‌యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా ట్ర‌బుల్ షూటర్ గా పేరొందిన షాతో కొంత సేపు మాట్లాడారు. అనంత‌రం డిన్న‌ర్ ఏర్పాటు చేశారు. దీంతో ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అమిత్ షా , గంగూలీని క‌ల‌వ‌డం పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది.

ఆయ‌న త్వ‌ర‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌బోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. వీటికి అడ్డుక‌ట్ట వేస్తూ పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. త‌న‌కు అంద‌రూ ముఖ్య‌మేన‌ని పేర్కొన్నారు.

ప‌నిలో ప‌నిగా ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని ఆకాశానికి ఎత్తేశారు. ఆమెను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly). దీదీ త‌న‌కు ఎంతో ద‌గ్గ‌ర అని చెప్ఆరు. ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రి ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా సౌర‌వ్ గంగూలీ ఈ కామెంట్స్ చేశారు.

ఈ ఆస్ప‌త్రి వైద్యుడిని సాయం కోసం సీఎం ద‌గ్గ‌ర‌కు నేనే తీసుకు వెళ్లా. ఆమె వెంట‌నే స్పందించారు. తోచినంత సాయం చేశారు. త‌న‌లోని ఉదార‌త‌ను చాటుకున్నారంటూ కితాబు ఇచ్చారు.

డాక్ట‌ర్ ఒక్క‌రే కాదు ఎవ‌రు స‌హాయం కావాల‌ని వెళ్లినా ఆదుకోవ‌డంలో ముందంజ‌లో ఉంటార‌ని ప్ర‌శంసించారు సౌర‌వ్ గంగూలీ. దీంతో త‌న‌పై వ‌స్తున్న ప్ర‌చారానికి చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు దాదా(Sourav Ganguly) .

మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారే త‌ప్పా ఇందులో ఎలాంటి రాజ‌కీయ పరంగా చ‌ర్చ‌లు రాలేద‌ని పేర్కొన్నారు దాదా.

 

Also Read : ల‌క్నో సెన్సేష‌న్ కోల్ క‌తా ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!