SP Singh Bhajel : పోషాకాహార లోపాలపై పరిశోధన జరగాలి
కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ భజేల్ పిలుపు
SP Singh Bhajel : తిరుపతి – దేశంలో అన్ని రకాల పోషకాహార లోపాలను తొలగించే ప్రక్రియలో ఆరోగ్య కరమైన, స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన పోషక ఆహారాల పై మరిన్ని పరిశోధనలు జరగాలని కేంద్ర, ఆరోగ్య శాఖ మంత్రి ఎస్పి సింగ్ భజేల్(SP Singh Bhajel) స్పష్టం చేశారు.
SP Singh Bhajel Comment
చంద్రగిరిలో మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ (ఎమ్ ఆర్ హెచ్ ఆర్ యు)ను కేంద్ర మంత్రి సందర్శించారు. పరిశోధన కేంద్రంలో పలు విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం భారత ప్రభుత్వ ఆరోగ్య పరిశోధన శాఖ(ఎన్ఐఎన్) ప్రతినిధి డాక్టర్ జేజే బాబు చేపట్టిన పరిశోధనలు, ఫలితాలను వివరించారు.
మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు సాధించిన విజయాలను శాస్త్రవేత్త డాక్టర్ సునీత విశదీకరించారు. అనంతరం ఎస్పీ సింగ్ భజేల్ తో విద్యార్థులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. దేశానికి ఉపయుక్తమైన పరిశోధనలు జరిగేలా పనితీరు కనబరచాలని పరిశోధక విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా ఆహార ధాన్యాలపై పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు.
అంగన్ వాడి కేంద్రాల్లో చిన్నారులకు, మధ్యాహ్న భోజన పథకంలో పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారంపై అధికారులతో భజేల్ చర్చించారు. పరిశోధన కేంద్రంలోని పలు రికార్డులను పరిశీలించారు.
ఇదిలా ఉండగా తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. మోడల్ రూరల్ హెల్త్ రీసెర్చ్ యూనిట్(ఎం ఆర్ హెచ్ ఆర్) స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్ ) కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
Also Read : Adimulapu Suresh : కార్మికుల సమస్యలపై ఫోకస్ – సురేష్