Spain Create Win : ఫిఫా వ‌రల్డ్ క‌ప్ ఛాంపియ‌న్ స్పెయిన్

ఫైన‌ల్ లో ఇంగ్లండ్ ను ఓడించి విశ్వ విజేత‌గా

Spain Create Win : యావ‌త్ ప్ర‌పంచం ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసింది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌హిళా చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్ ను. కోట్లాది మంది వీక్షించారు ఈ కీల‌క పోరును. కార‌ణం ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై బెట్టింగ్ కూడా చోటు చేసుకుంది. కానీ చివ‌ర‌కు విశ్వ విజేత‌గా స్పెయిన్ మ‌హిళ‌ల జ‌ట్టు నిలిచింది. త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది. ఎక్క‌డా ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు ఛాన్స్ ఇవ్వ‌లేదు. డిఫెన్స్ ను ఆడుతూ మ‌రో వైపు ఇంగ్లండ్ ఆట‌గాళ్ల‌కు చిక్క‌కుండా బంతిని చూసుకున్నారు స్పెయిన్ పుట్ బాల‌ర్స్.

Spain Create Win Viral

తొలి అర్థ భాగంలో స్పెయిన్ క‌ళ్లు చెదిరేలా చ‌క్క‌టి గోల్ చేసింది. దీంతో ఇంగ్లండ్ జ‌ట్టుపై ఒత్తిడి పెరిగింది. ర‌క్ష‌ణాత్మ‌కంగా ప్లే చేస్తూ వెళ్లింది. చివ‌రి దాకా అదే ఆట తీరును కొన‌సాగించింది స్పెయిన్. ఫిఫా మ‌హిళ‌ల వ‌రల్డ్ క‌ప్ లో స్పెయిన్ సంచ‌ల‌నం న‌మోదు చేసింది. విచిత్రం ఏమిటంటే మొద‌టిసారి ఎంట్రీ ఇచ్చిన టీమ్ ఫుట్ బాల్ విశ్వ విజేత‌గా నిలిచింది.

తుది ఫైన‌ల్ లో 1-0 తేడాతో ఇంగ్లండ్ జ‌ట్టును ఓడించింది. జ‌గ‌జ్జేత‌గా నిలిచింది స్పెయిన్ . ఇదిలా ఉండ‌గా ఫైన‌ల్ మ్యాచ్ లో కేవ‌లం ఒకే ఒక్క గోల్ న‌మోదు కావ‌డం విస్తు పోయేలా చేసింది. ఈ కీల‌క‌మైన గోల్ ను స్పెయిన్ స్ట్రైయిక‌ర్ ఓల్గా కార్మోనా(Olga Carmona) 29వ నిమిషంలో గోల్ చేసింది. అదే ఛాంపియ‌న్ గా నిలిచేలా చేసింది.

Also Read : IND vs IRE 2nd T20 : భార‌త్ దెబ్బ‌కు ఐర్లాండ్ బోల్తా

Leave A Reply

Your Email Id will not be published!