#SpecialTrains : విశాఖ స్పెష‌ల్ ట్రైన్ల వేళ‌ల్లో మార్పు

రాయ‌గ‌డ‌, ప‌లాస స్పెష‌ల్ ట్రైన్ల వేళ‌లు మార్పు

Special Trains  : క‌రోనా దృష్ట్యా దేశంలోని ప్ర‌ధాన రైల్వే డివిజ‌న్ల‌లో ప‌లు రైళ్ల రాక పోక‌ల‌కు సంబంధించిన వేళ‌ల‌ను మార్చుతున్నారు. ప‌రిస్థితి మెల మెల్ల‌గా అదుపులోకి రానుండ‌డంతో పూర్తి స్థాయిలో రైళ్ల‌ను న‌డిపించేందుకు భార‌తీయ రైల్వే సంస్థ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ప‌రిధిలో న‌డుస్తున్న ప‌లు స్పెష‌ల్ రైళ్ల వేళ‌లు మారిన‌ట్లు వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డివిజ‌న‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ త్రిపాఠి తెలిపారు. ఈ మార్పు త్వ‌ర‌లోనే అమ‌లులోకి రానుంద‌ని వెల్లడించారు.

రాయ‌గ‌డ నుంచి విశాఖ‌ప‌ట్ట‌ణం 08507 నంబ‌రు క‌లిగిన స్పెష‌ల్ ట్రైన్ ఉద‌యం 5.45 గంట‌ల‌కు రాయ‌గ‌డ‌లో బ‌య‌లు దేరుతుంది. అక్క‌డ అదే రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు విశాఖ‌ప‌ట్ట‌ణంకు చేరుకుంటుంది. తిరుగు ప్ర‌యాణంలో 08508 నంబ‌రు గ‌ల ప్ర‌త్యేక రైలు విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌తిరోజు సాయంత్రం 6 గంట‌ల‌కు విశాఖ చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 10.05 గంట‌ల‌కు రాయ‌గ‌డ‌కు చేరుకుంటుంది.

ఈ ప్ర‌త్యేక రైలు ఇరు మార్గాల‌లో సింహాచ‌లం, కొత్త‌వ‌ల‌స‌, విజ‌య‌న‌గ‌రం, గ‌జ‌ప‌తిన‌గ‌రం, బొబ్బిలి, పార్వ‌తీపురం, పార్వ‌తీపురం టైన్ స్టేష‌న్‌ల‌లో ఆగుతుంది. ఇక ప‌లాస నుంచి విశాఖ‌ప‌ట్ట‌ణం 08531 నెంబ‌ర్ క‌లిగిన స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌తి రోజూ ప‌లాస‌లో ఉద‌యం 5 గంట‌ల‌కు బ‌య‌లు దేరుతుంది. అదే రోజు ఉద‌యం 9.25 గంట‌ల‌కు విశాఖ‌కు చేరుకుంటుంది.

తిరుగు ప్ర‌యాణంలో 08532 నెంబ‌రు క‌లిగిన ట్రైన్ విశాఖ‌లో ప్ర‌తి రోజూ సాయంత్రం 5.45 గంట‌ల‌కు బ‌య‌లు దేరి రాత్రి 10 గంట‌ల‌కు ప‌లాస చేరుకుంటుంది. ఈ రైలు ఇరు మార్గాల‌లో సింహాచ‌లం, కొత్త‌వ‌ల‌స‌, విజ‌య‌న‌గ‌రం, చీపురుప‌ల్లి, పొందూరు , శ్రీ‌కాకుళం రోడ్డు, తిలారు, నౌప‌డ స్టేష‌న్‌ల‌లో ఆగుతుంద‌ని త్రిపాఠి వెల్ల‌డించారు.

No comment allowed please