#Mirchibajji : గుంటూరు ఫేమస్ మిర్చి బజ్జి..

ఈ రోజు మనం ఇంట్లోనే గుంటూరు ఫేమస్ మిర్చి బజ్జి తయారు చేసుకోబోతున్నాం.

Mirchi bajji : సాయంత్రం అయితే చాలు బయటకు వెళ్లి ఏదో ఒకటి తినాలనిపిస్తోంది. కానీ బయట దొరికే ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఈ రోజు మనం ఇంట్లోనే గుంటూరు ఫేమస్ మిర్చి బజ్జి తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావలసిన పదార్ధాలు, తయారు చేయు విధానం ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు :

బజ్జి మిర్చి – 1/4 కిలో
శనగ పిండి – 2 కప్పులు
బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్
ఆయిల్ – సరిపడ
వాము – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
పసుపు – చిటికెడు
సోడా ఉప్పు – చిటికెడు

తయారుచేయు విధానం :

ముందుగా ఒక మిక్సీ జార్ లో వాము, 2 టేబుల్ స్పూన్స్ శనగ పిండి తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి మిర్చిలను మధ్యలో చీల్చి అందులో వాము, శనగపిండి మిశ్రమం పెట్టాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి అందులో ఓ స్పూన్ ఆయిల్ వేసి మరోసారి కలపండి. తర్వాత ఇందులో తగినంత నీరు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని నూనె వేసి వేడి అయిన తర్వాత మిర్చిలను పిండిలో ముంచి నూనెలో వేసి దోరగా వేయించండి. అంతే ఎంతో రుచిగా ఉండే గుంటూరు ఫేమస్ మిర్చి బజ్జి రెడీ అయినట్లే. వీటిని వేడివేడిగా టమాటా సాస్‌తో కానీ, ఉల్లిపాయ కాంబినేషన్‌తో కానీ తింటే సూపర్ గా ఉంటుంది.

No comment allowed please