#VaacinetionDrive : దేశ‌మంత‌టా క‌రోనా వ్యాక్సినేష‌న్ పండుగ

వ్యాక్సిన్ వేసుకున్న ప్రముఖులు

Vaacinetion Drive : ప్ర‌పంచంలోనే అతి పెద్ద క‌రోనా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ యుద్ధ ప్రాతిప‌దిక‌న ప్రారంభ‌మైంది. వంద కోట్ల‌కు పైగా ఉన్న భార‌తీయుల‌కు ఇది ప‌రీక్షా స‌మ‌యం. ఈ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని భార‌త ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించారు. ఆ త‌ర్వాత దేశంలోని వివిధ రాష్ట్రాల‌లో ముఖ్య‌మంత్రులు స్టార్ట్ చేశాడు. రెండు విడ‌తులుగా దీనిని పంపిణీ చేస్తారు. మొద‌టి విడ‌త‌లో 3 కోట్ల మందికి వేస్తుండ‌గా రెండో విడ‌త‌లో 30 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ను అంద‌జేస్తారు. ఇప్ప‌టికే కోటిన్న‌ర మందికి పైగా టీకాలు వేసుకున్నారు.

ఇంకా ఈ పంపిణీ ప్ర‌క్రియ‌లో ల‌క్ష‌లాది మంది సిబ్బంది, ఉద్యోగులు పాల్గొంటున్నారు. తొలి ద‌శ‌లో దేశ వ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంర‌క్ష‌ణ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ యోధుల‌కు టీకాలు ఇచ్చారు. ఆయా ఆస్ప‌త్రులు, ఆరోగ్య కేంద్రాల్లో పండుగ వాతావ‌ర‌ణం క‌నిపించింది. పూలు, బెలూన్ల‌తో వాటిని అలంకరించారు. టీకా తీసుకునేందుకు వ‌చ్చిన వారికి స్వాగ‌తం ప‌లికారు. కొన్ని చోట్ల ప్రార్థ‌న‌లు చేశారు. స్వీట్లు కూడా పంచారు.

వ్యాక్సిన్(Vaacinetion Drive) బాక్సుల‌కు పూల‌దండ‌లు, హార‌తులు ఇచ్చిన దృశ్యాలు వైర‌ల్ అయ్యాయి. దేశంలో క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్ట మొద‌టి వ్య‌క్తిగా పారిశుధ్య కార్మికుడు మ‌నీస్ కుమార్ గుర్తింపు పొందాడు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అత‌నికి వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. భార‌త్ బ‌యో టెక్ సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ఇచ్చారు. టీకా తీసుకునేందుకు చాలా మంది భ‌యప‌డ్డార‌ని, కానీ తాను మాత్రం ధైర్యం చేసి తీసుకున్నాన‌ని చెప్పారు.

క‌రోనా ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఉన్న అపోహ‌లు తొల‌గించేందుకు ప్ర‌ముఖులు సైతం క్యూలో నిల్చుని టీకాలు తీసుకున్నారు. వారిలో ఎయిమ్స్ డైరెక్ట‌ర్ గులేరియా, నీతి ఆయోగ్ మెంబ‌ర్ వి.కె.పాల్, ఎస్ఐఐ సిఇఓ ఆదార్ పూనావాలా, ప‌శ్చిమ బెంగాల్ మంత్రి నిర్మ‌ల్, త‌దిత‌రులు ఉన్నారు. మొద‌టి రోజు రెండు కోట్ల మందికి పైగా టీకాలు(Vaacinetion Drive) తీసుకుని రికార్డు సృష్టించారు. మొద‌టి విడ‌త పూర్త‌య్యాక 28 రోజుల త‌ర్వాత రెండో డోస్ స్టార్ట్ అవుతుంది.

No comment allowed please