Statue Of Eqality : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద విగ్రహం ఏర్పాటైన సమతామూర్తి (Statue Of Eqality)కేంద్రంలో అడుగడుగునా పోలీసులే కనిపిస్తున్నారు. ఈనెల 2న ప్రారంభమైన మహోత్సవ కార్యక్రమాలు 14 వరకు కొనసాగనున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పటికే కార్యక్రమాన్ని అధికారికంగా శ్రీశ్రీశ్రీ త్రిదండ రామానుజ చిన జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో ప్రారంభమయ్యాయి. భారీ ఎత్తున వేద పండితులు, రుత్వికులు, భక్తులు, ప్రముఖులు తరలి వచ్చారు.
ఇదిలాఉండగా రూ. 1000 కోట్లతో 216 అడుగులతో శ్రీ భగవద్ రామానుజాచార్యుల(Statue Of Eqality) విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చైనాకు చెందిన కార్పొరేషన్ కంపెనీ తయారు చేసింది.
60 మంది నిపుణులు ఇందులో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఇండియాకు తీసుకు వచ్చేందుకు విగ్రహ నిర్వాహకులు రూ. 32 కోట్లు చెల్లించడం జరిగిందని దేవనాథ స్వామి ఇప్పటికే వెల్లడించారు.
ఈ తరుణంలో ఉత్సవాలలో భాగంగా ఈనెల 5న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ విచ్చేస్తున్నారు. ఆయన ఆరోజు ఐదు గంటల పాటు ఉంటారు.
దీంతో భద్రతా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 7 వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
ప్రధాని టూర్ సందర్భంగా ఇప్పటికే హెలిప్యాడ్ కూడా రెడీ చేశారు. ఎస్పీజీ టీం విగ్రహం ప్రాంగణంతో పాటు యాగశాలను సందర్శించింది. డీఐజీ నవనీత్ కుమార్ రాష్ట్ర పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదిలా ఉండగా కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఎస్పీజీతో పాటు ఆక్టోపస్ , స్పెషల్ కమాండోలు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు.
Also Read : ఆధ్యాత్మికత తోనే మానవాళిలో పరివర్తన