Statue Of Equality : ఆధ్యాత్మిక వైభ‌వం ఆనంద సాగ‌రం

నేటితో ముగియ‌నున్న స‌మారోహం

Statue Of Equality : హైద‌రాబాద్ లోని ముచ్చింత‌ల్ లో ప్రారంభ‌మైన స‌మ‌తామూర్తి స‌మారోహ స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాలు(Statue Of Equality) ఇవాళ్టితో ముగిశాయి. దేశం న‌లు మూల‌ల నుంచి తండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు శ్రీ‌రామ‌న‌గ‌రంకు.

ఈనెల 2న ప్రారంమైన ఈ ఉత్స‌వాలు 13 రోజుల పాటు కొన‌సాగాయి. మొద‌టి రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.

రూ. 1000 కోట్ల‌తో దేశం లోనే అతి పెద్ద 216 అడుగులు క‌లిగిన శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని స‌మతా కేంద్రం ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేశారు.

కొన్నేళ్ల కింద‌ట దీనిని ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారు సంక‌ల్పించారు. 2014లో దీనికి అంకురార్ప‌ణ జ‌రిగింది. చైనాకు చెందిన కార్పొరేష‌న్ కంపెనీ దీనిని నిర్మించింది.

ఇందులో 60 మంది నిపుణులు, 2 వేల మందికి పైగా పాల్గొన్నారు. సుదీర్ఘ కాలం అనంత‌రం వెయ్యేళ్ల కింద‌ట జ‌న్మించిన శ్రీ రామానుజుడి విగ్రహాన్ని ఇక్క‌డ ఏర్పాటు చేశారు చిన్న‌జీయ‌ర్ స్వామి.

ఇదంతా ఆయ‌న కృప‌నేని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈనెల 5న దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ స‌మ‌తా మూర్తి(Statue Of Equality) విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. జాతికి అంకితం చేశారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి , రాజ్ నాథ్ సింగ్ , అనురాగ్ ఠాకూర్, సీఎంలు కేసీఆర్, జ‌గ‌న్, శివ‌రాజ్ సింగ్ చౌహాన్ , గ‌వ‌ర్న‌ర్లు ర‌వి, విశ్వ భూష‌ణ్, త‌మిళి సై సౌంద‌ర రాజ‌న్ హాజ‌ర‌య్యారు.

స్వ‌ర్ణ మూర్తి విగ్ర‌హాన్ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ఆవిష్క‌రించారు. ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప్ర‌పంచంలోని అద్బుతాల్లో స‌మతా మూర్తి ఒక‌ట‌ని పేర్కొన్నారు. స్వాములు, పీఠాధిప‌తులు, యోగులు, ప్ర‌వ‌చ‌న‌క‌ర్త‌లు, 5 వేల మంది రుత్వికులు పాల్గొన్నారు.

Also Read : ఆధ్యాత్మిక కేంద్రంగా స‌మ‌తామూర్తి

Leave A Reply

Your Email Id will not be published!