Sri Lanka Crisis : శ్రీలంకలో ఆగని ఆందోళనలు
రాజపక్సే గో బ్యాక్ అంటూ నిరసనలు
Sri Lanka Crisis : శ్రీలంకలో కొత్తగా రణిలె విక్రమసింఘె ప్రధాన మంత్రిగా కొలువు తీరినా ఆ దేశ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున జనం తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.
పెట్రోల్, డీజిల్, ఆహార పదార్థాల కొరత ఇంకా వేధిస్తూనే ఉంది శ్రీలంక(Sri Lanka Crisis) ప్రజల్ని. దేశ అధ్యక్షుడు రాజపక్సె వెంటనే దిగి పోవాలని కోరుతూ నిరసనలు మిన్నంటాయి.
స్వచ్చందంగా ప్రజలు బయటకు వచ్చి చేపట్టిన ఆందోళనలు శనివారం నాటికి 50 రోజులకు చేరింది. ఇప్పటికే పలువురు చని పోగా , నిరసనకారుల చేతుల్లో ఓ ఎంపీ మృతి చెందిన విషయం తెలిసిందే.
దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకు పోవడానికి ప్రధాన కారణం రాజపక్సే ఫ్యామిలీ అంటూ జనం మండి పడుతున్నారు. ఒకానొక దశలో దేశ అధ్యక్షుడి భవనం పైకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు.
ఇదే సమయంలో ప్రధాన మంత్రిగా ఉన్న మహింద రాజపక్సే తన పదవికి తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేశారు. ఆయనతో పాటు కుమారుడిని, ఇతర నాయకులను దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించింది శ్రీలంక సర్వోన్నత న్యాయ స్థానం.
ఇదే సమయంలో తనపై దాడికి దిగుతారేమోనన్న భయంతో ఓ చోట అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తలదాచుకున్నాడు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు.
భారత దేశం ఒక్కటే వెంటనే స్పందించి తోచిన సాయం చేసింది. శ్రీలంక(Sri Lanka Crisis) అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. అతడు వెంటనే తప్పు కోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : రక్షించుకునేందుకు గన్స్ అవసరం