Sri Lanka Crisis : హ‌క్కుల ఉల్లంఘ‌న స‌ర్వ‌త్రా ఆందోళ‌న

సంక్షోభానికి కార‌ణం శ్రీ‌లంక ప్ర‌భుత్వం

Sri Lanka Crisis : శ్రీ‌లంక‌లో కొత్త‌గా అధ్య‌క్షుడిగా రిణిలే విక్ర‌మ సింఘే కొత్త‌గా అధ్య‌క్షుడిగా కొలువు తీరారు. గ‌తంలో ఆరు సార్లు ఆ దేశానికి ప్ర‌ధానమంత్రిగా ఉన్నారు.

తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో గుట‌బ‌య రాజ‌ప‌క్సే దేశం విడిచి పారి పోయాడు. ప్ర‌ధానిగా ఉన్న మ‌హింద రాజ‌ప‌క్సే ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నాడు.

ఈ త‌రుణంలో దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. ఆహారం, ఆర్థిక‌, గ్యాస్ , విద్యుత్ సంక్షోభం నెల‌కొంది శ్రీ‌లంక‌లో. అంతే కాకుండా వేలాది మంది రోడ్ల‌పైనే రోజుల కొద్ది వేచి చూస్తున్నారు ఇంధ‌నం కోసం.

దేశంలో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న చోటు చేసుకుంటోంద‌ని ఐక్య రాజ్య స‌మితి నిపుణులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా ఆర్థిక సంక్షోభంపై అప్ర‌మ‌త్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ‌లంక‌కు(Sri Lanka Crisis) మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరింది మాన‌వ హ‌క్కుల నిపుణుల బృందం. దేశంలో చోటు చేసుకున్న ఆర్థిక ప‌త‌నంపై త‌క్ష‌ణ‌మే ప్ర‌పంచం దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉందైని పేర్కొంది.

కేవ‌లం మాన‌వ‌తా సంస్థ‌ల నుండి మాత్ర‌మే కాదు అంత‌ర్జాతీయ సంస్థ‌లు, ప్రైవేట్ రుణ దాత‌లు , ఇత‌ర దేశాల నుండి దేశానికి స‌హాయం చేయాల‌ని విన్న‌వించింది బృందం.

రికార్డు స్థాయిలో అధిక ద్ర‌వ్యోల్బ‌ణం, పెరుగుతున్న వ‌స్తువుల ధ‌ర‌లు, విద్యుత్ కొర‌త , ఇంధ‌న సంక్షోభం , ఆర్థిక ప‌త‌నంపై తొమ్మిది మందితో కూడిన నిపుణులు టీం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న ప్ర‌మాద‌క‌ర‌ని పేర్కొన్నారు యుఎన్ స్వ‌తంత్ర నిపుణుడు అత్తియా వారిస్ . ప్రాథ‌మిక హ‌క్కుల‌కు హామీ ఇవ్వాల‌ని కోరారు.

Also Read : అనూహ్యంగా పెన్నీ మోర్డాంట్ నిష్క్ర‌మ‌ణ

Leave A Reply

Your Email Id will not be published!