Sri Lanka Dismisses : ‘పులి’ బతికే ఉందనడం అబద్దం
నిడుమారన్ కామెంట్స్ పై శ్రీలంక
Sri Lanka Dismisses : ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని, త్వరలోనే జనావాసంలోకి వస్తాడని సంచలన ప్రకటన చేశారు తమిళ జాతీయోద్యమ నాయకుడు, రచయిత, మాజీ కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు పజా నెడుమారన్.
ఆయన చేసిన ఈ ప్రకటన ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. దీనిపై చర్చ కూడా ప్రారంభమైంది. దీంతో ప్రభాకరన్ అంశం ప్రాధాన్యత కలిగి ఉండడంతో శ్రీలంక ప్రభుత్వం మంగళవారం స్పందించింది. ఎల్టీటీఈ చీఫ్ బతికి ఉండేందుకు ఆస్కారం లేదని(Sri Lanka Dismisses) స్పష్టం చేసింది.
భౌతికంగా తుద ముట్టించామని, నామ రూపాలు లేకుండా చేశామని ప్రకటించింది. నెడుమారన్ చేసిన ప్రకటనను ఓ జోక్ గా అభివర్ణించింది. మంగళవారం కీలక ప్రకటన చేసింది శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ(Sri Lanka Dismisses). ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడనే వాదన పూర్తిగా అబద్దం..నిరాధారం అని పేర్కొంది. ప్రభాకరన్
19 మే, 2009లో చంప బడ్డాడని ధ్రువీకరించడం జరిగింది. ఇందుకు సంబంధించిన డీఎన్ఏ కూడా నిరూపించిందని తెలిపిందని శ్రీలంక రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ సిలన్ హెరాత్ వెల్లడించారు. 1983లో ప్రారంభమైన ఎల్టీటీఈ పోరాటం తీవ్ర రూపం దాల్చింది. నిత్యం కాల్పులు, హత్యలతో , దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. రక్తపు టేరులు పారాయి. మూడు దశాబ్దాల క్రూరమైన అంతర్యుద్దం చోటుచేసుకుంది.
లక్ష మందికి పైగా చని పోయారు. ప్రపంచ చరిత్రలో ఇది మహా విషాదం. మే 18, 2009న అప్పటి చీఫ్ మహీంద రాజపక్సే 26 ఏళ్ల యుద్దం ముగిసినట్లు ప్రకటంచారు. లక్షలాది మంది ప్రజలు , మైనార్టీ తమిళులు దేశం, విదేశాలలో శరణార్థులుగా నిరాశ్రయులయ్యారు.
Also Read : భద్రత ముఖ్యం కూల్చడం ఖాయం