Sri Lanka MP Killed : దాడుల్లో లంక ఎంపీ మృతి
నిరసనకారులపై కాల్పుల ఘటన
Sri Lanka MP Killed : శ్రీలంకలో సంక్షోభం ముదిరి పాకాన పడింది. ఆర్థిక పతనం అంచున ద్వీప దేశం చేరుకుంది. పరిస్థితి విష మించడంతో ప్రధాన మంత్రి మహింద రాజపక్స రాజీనామా చేశారు.
దీంతో ఆయన మద్దతుదారులు నిరసనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేకత మరింత వ్యక్తమైంది.100 మందికి పైగా పోలీసులు జరిపిన దాడుల్లో గాయపడ్డారు.
ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ(Sri Lanka MP Killed) అమరకీర్తి అత్తుకోరల నిట్టంబువలో తన కారును అడ్డగించిన ఇద్దరిపై కాల్పులకు దిగారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందేందుకు ప్రయత్నించి దాడికి పాల్పడడంతో చని పోయాడు.
ఎంపీ(Sri Lanka MP Killed) చని పోయిన విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. శ్రీలంక ప్రధాని నివాసం వెలుపల ప్రదర్శనకారులు, ప్రభుత్వ మద్దతుదారులు ఘర్షణ పడ్డారు.
పలువురు ఆస్పత్రి పాలయ్యారు. 76 ఏళ్ల రాజపక్సే తన రాజీనామా లేఖను తన తమ్ముడు , అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు పంపి కొత్త ఐక్య ప్రభుత్వానికి మార్గం సుగమం చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందు తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంత్రివర్గం రద్దయింది.
రాజపక్సే వంశానికి చెందిన వ్యక్తి నేతృత్వంలోని ఏ ప్రభుత్వంలోనూ చేరేందుకు అతి పెద్ద ప్రతిపక్ష పార్టీ నిరాకరించింది.
శ్రీలంకలో స్వాతంత్రం వచ్చాక అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆమారం, ఇంధనం, ఔషధాల కొరతను ఎదుర్కొంటోంది.
శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనలు మిన్నంటాయి. రాజపక్సే మద్దతుదారులు నిరసనకారులపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్ , వాటర్ కేనన్లను ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read : శ్రీలంక ప్రధాని రాజపక్స రాజీనామా