PM Sri Lanka Resign : శ్రీలంక పీఎం విక్రమ సింఘే రాజీనామా
పీఎం ఇంటికి నిప్పు..వాహనాలు ధ్వంసం
PM Sri Lanka Resign : తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత దెబ్బకు శ్రీలంక అట్టుడుకుతోంది. దేశం సర్వ నాశనం కావడానికి దేశ అధ్యక్షుడు గోటబోయ రాజపక్సే, మహీంద్ర రాజపక్సే కారణమంటూ ప్రజలు రోడ్డెక్కారు.
ఇప్పటికే తినేందుకు తిండి లేక, పెట్రోల్ , డీజిల్ దొరకక ఏకంగా 100 మందికి పైగా ఆకలి చావులకు గురయ్యారు. దీంతో కొంత కాలం నుంచీ ఓపిక పడుతూ వచ్చిన జనం ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు.
లక్షలాదిగా అధ్యక్షుడి భవనాన్ని ముట్టడించారు. ముందే తెలుసుకున్న ప్రెసిడెంట్ గోటబోయ వెనుక నుంచి పరారయ్యాడు. పెట్టే బేడా సర్దుకుని చాప చుట్టేశాడు. ఏ దేశానికి వెళ్లాడనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ తరుణంలో ప్రధాన మంత్రి రణిలె విక్రమసింఘే ఇంటికి నిప్పంటించారు. ఆపై ఆయనకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో తాను కూడా తన ప్రధాన మంత్రి పదవికి(PM Sri Lanka Resign) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.
కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత దాకా తాను సహకరిస్తానంటూ వెల్లడించాడు విక్రమ సింఘే. ఇదే సమయంలో రాష్ట్రపతి, పీఎం రాజీనామాలకు ఒప్పు కోవడంతో శ్రీలంక రాజ్యాంగం మేరకు స్పీకర్ రాష్ట్రపతిగా 30 రోజుల పాటు ఉంటారు.
ఆ సమయంలో పార్లమెంట్ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు విక్రమ సింఘే. ప్రభుత్వ కొనసాగింపు, పౌరులందరి భద్రత కోసం తన పీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అఖిలపక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నానని తెలిపాడు. ఇదిలా ఉండగా మాజీ క్రికెట్ కెప్టెన్లు సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే హింసను ఖండించారు. శాంతియుతంగా ఉండాలని కోరారు.
Also Read : ముదిరిన సంక్షోభం పెల్లుబికిన ప్రజాగ్రహం