Sri Lanka Protests : లంక‌లో ఉద్రిక్తం పీఎం ఇంటికి నిప్పు

రాజీనామా చేయ‌నున్న ప్రెసిడెంట్

Sri Lanka Protests : ఆర్థిక‌, ఆహార సంక్షోభంతో అట్టుడుకుతోంది ద్వీప దేశం శ్రీ‌లంక‌(Sri Lanka Protests). ప్ర‌జ‌ల ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. ఇప్ప‌టికే దేశ అధ్య‌క్షుడు గోట‌బోయ రాజ‌ప‌క్సె నివ‌సిస్తున్న రాజ భ‌వ‌నంలోకి చొచ్చుకు పోయారు నిర‌స‌న‌కారులు. పోలీసులు చేతులెత్తేశారు.

ముందే విష‌యం తెలుసుకున్న అధ్య‌క్షుడు పెట్టే బేడా స‌ర్దుకుని పారి పోయాడు. అక్క‌డి నుంచి ఆర్మీ క్యాంపులో త‌ల‌దాచుకున్నాడు. ల‌క్ష‌లాది మంది ఉప్పెన‌లా త‌ర‌లి వ‌చ్చారు.

దీంతో భ‌యాందోళ‌న‌కు గురైన రాజ‌ప‌క్సె దొడ్డి దారిన ప‌డ‌వ ద్వారా ఉడాయించాడు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం దేశంలో ఉన్న ఎంపీలు, మాజీ మంత్రులను అందిన మేర‌కు చిత‌క బాదారు.

దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న నెల‌కొంది. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరిన ర‌ణిల విక్ర‌మ‌సింఘె ఇంటికి నిప్పు పెట్టారు.

ఆయ‌న కూడా దెబ్బ‌కు రాజీనామా చేశాడు. ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్ర‌స్తుతం పూర్తిగా అదుపు త‌ప్పింది. ఇక భార‌త దేశం వేచి చూసే ధోర‌ణిని అవ‌లంభిస్తోంది. ఈ మొత్తం ఆందోళ‌న‌లకు ప్ర‌ధాన కార‌ణం ఆహారం, ఇంధ‌నం, విద్యుత్ కొర‌త‌. ఇలా త‌యారు కావ‌డానికి ముఖ్య కార‌ణం చైనా. శ్రీ‌లంక‌ను దొంగ దెబ్బ కొట్టింది.

ప‌రిస్థితి కంట్రోల్ లోకి రావాలంటే అధ్య‌క్షుడు త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం త‌ప్ప మ‌రొక‌టి లేక పోవ‌డం ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌ధాన మంత్రి కూడా త‌ప్పు కోవ‌డంతో ఆ దేశ రాజ్యాంగం ప్ర‌కారం స్పీక‌ర్ ప్రెసిడెంట్, ప్ర‌ధానిగా కొలువు తీరేంత వ‌ర‌కు అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తారు.

పీఎంకు చెందిన వాహ‌నాలను ధ్వంసం చేయ‌డంతో దేశం కోసం, ప్ర‌జ‌ల భ‌ద్ర‌త కోసం తాను త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

Also Read : ప్ర‌జాగ్ర‌హం ముందు పాల‌కులు బ‌లాదూర్

 

Leave A Reply

Your Email Id will not be published!