Sajith Premadasa : భారత్ సహకారం శ్రీలంకకు అవసరం
ఎవరు గెలిచినా మద్దతు ఇవ్వాలన్న ప్రేమదాస
Sajith Premadasa : యావత్ ప్రపంచం ఇప్పుడు శ్రీలంక వైపు చూస్తోంది. దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆహారం, ఇంధనం, ఔషధాలు, గ్యాస్ , విద్యుత్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
లక్షలాది మంది లంకేయులు రోడ్లపైకి వచ్చారు. ఈ దేశం సర్వ నాశనం కావడానికి ప్రధాన కారణం రాజపక్సే కుటుంబం అంటూ నిప్పులు చెరిగారు. ప్రెసిడెంట్ భవనాన్ని ముట్టడించారు.
పీఎం ఇంటిపై దాడి చేశారు. వాహనాలను దగ్ధం చేశారు. దీని దెబ్బకు ప్రెసిడెంట్ గోటబయ రాజపక్సే పారి పోయాడు. మాజీ ప్రధాని మహీంద రాజపక్సే ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నాడు.
ఇదిలా ఉండగా పారిపోయిన ప్రెసిడెంట్ స్థానంలో కొత్త అధ్యక్షుడిని శ్రీలంక పార్లమెంట్ ఎన్నుకోనుంది రహస్య బ్యాలెట్ పద్దతి ద్వారా. కాగా అధ్యక్షుడి రేసులో ముగ్గురు పోటీ పడుతున్నారు.
అయితే లంకకు చీఫ్ గా ఎవరు గెలిచినా వారికి భారత దేశం బేషరతుగా మద్దతు ఇవ్వాలని కోరారు శ్రీలంకలోని ప్రతిపక్ష నాయకుడు, సమగి జన బలవేగయ పార్టీ చీఫ్ సజిత్ ప్రేమ దాస(Sajith Premadasa). ప్రస్తుతం భారీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.
ఈ దేశానికి ఇండియా సపోర్ట్ చాలా అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆయన అధికారికంగా ట్వీట్ చేశారు.
శ్రీలంక దేశానికి ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికైనా ముఖ్యం కాదు. కానీ నరేంద్ర మోదీ తో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలంతా శ్రీలంకకు మద్దతు ఇవ్వాలని కోరారు సజిత్ ప్రేమదాస. తాజాగా సజిత్ ప్రేమ దాస చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read : శ్రీలంక కొత్త అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ