Sri Lanka Emergency : విదేశీ రుణాలతో ద్వీప దేశాన్ని కుంగ దీసిన ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. దీంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అర్ధరాత్రి నుంచి అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ ) ప్రకటించారు.
ఆందోళనలు, నిరసనలు ఎదుర్కొనేందుకు ఐదు వారాల్లో రెండోసారి భద్రతా బలగాలకు విస్తృత అధికారాలు ఇస్తూ శ్రీలంక చీఫ్ శనివారం ఎమర్జెన్సీ(Sri Lanka Emergency )ప్రకటించారు.
తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా సమ్మెను నిర్వహించాయి. పబ్లిక్ ఆర్డర్ కోసం కఠినమైన చట్టాలను అమలు చేసినట్లు రాష్ట్రపతి ప్రతినిధి వెల్లడించారు.
ఉదయం శ్రీలంక పార్లమెంట్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు మళ్లీ టియర్ గ్యాస్ , వాటర్ ఫిరంగిలను ప్రయోగించారు. ప్రభుత్వం రాజీనామా చేయాలని ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది.
పరిస్థితి దారుణంగా ఉంది దేశంలో. నెలల తరబడి బ్లాక్ అవుట్ లు, ఆహారం, ఇంధనం, ఔషధాల కొరత కారణంగా 22 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆకలి కేకలతో అల్లాడుతున్నారు.
1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రీలంకలో అత్యంత దారుణమైన సంక్షోభాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటోంది. ఇప్పటికే దేశ ఆర్థిక మంత్రి పరిస్థితి చేయి దాటి పోయిందని ప్రకటించారు.
ట్రేడ్ యూనియన్లు చేపట్టిన ఆందోళనలో లక్షలాది మంది కార్మికులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు ప్రదర్శించారు.
ఒక్కటి తప్ప మిగిలిన అన్ని రైలు సర్వీసులు రద్దు చేశారు. ప్రైవేట్ యాజమాన్యంలోని బస్సులు రోడ్లకు దూరంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు డీఎంకే ఎంపీలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
Also Read : ఫ్రాన్స్ భారత్ బంధం బలోపేతం