Sri Lanka Crisis : లంక ఎంపీ, మాజీ మంత్రి ఇళ్లకు నిప్పు
ద్వీప దేశంలో మిన్నంటిన ఆందోళనలు
Sri Lanka Crisis : ద్వీప దేశం శ్రీలంక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ప్రధాన మంత్రి మహింద రాజపక్స తప్పుకున్నాడు.
ఆయన మద్దతుదారులు, ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారుల మధ్య యుద్దం కొనసాగుతోంది. ఇదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ కాల్పులకు తెగ బడటం, చివరకు వారి చేతుల్లోనే ఆయన మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఇదిలా ఉండగా ఎంపీ, మాజీ మంత్రి ఇళ్లకు నిప్పు పెట్టారు(Sri Lanka Crisis). సోమవారం సాయంత్రం ఆందోళనకారులు మరింత రెచ్చి పోయారు. శ్రీలంక శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఇళ్లను టార్గెట్ చేశారు.
మౌంట్ లావినియా లోని మాజీ మంత్రి జాన్సటన్ ఫెర్నాండో నివాసం, ఎంపీ సనత్ నిశాంత ఇంటిపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు.
వారి ఇళ్లకు నిప్పు పెట్టారు(Sri Lanka Crisis). దీంతో దట్టమైన పొగలు ఆవరించాయి. పరిస్థితి అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
భద్రతా బలగాలకు సర్వాధికారాలు అప్పగించారు అధ్యక్షుడు రాజపక్సె. దీనిని నిరసిస్తూ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ప్రదానమంత్రి మహీందా రాజపక్స(Sri Lanka Crisis) మద్దతు దారులను లక్ష్యంగా చేసుకున్నారు.
అనంతరం పరిస్థితి అదుపు తప్పడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక ఎంపీతో పాటు ముగ్గురు మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారు.
కొలంబో లోని సీ ఫ్రంట్ గాల్ ఫేస్ ప్రొమెనేడ్ లో పీఎం విధేయులు దాడికి పాల్పడ్డారు.
ఇదిలా ఉండగా దాడులకు దిగడాన్ని, కాల్పులు జరపడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు శ్రీలంక మాజీ క్రికెటర్లు కుమార సంగక్కర, మహేళ జయవర్దనే. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది మహీంద రాజపక్సేనంటూ ఆరోపించారు.
Also Read : దాడుల్లో లంక ఎంపీ మృతి