Sri Lanka Crisis : సోదరుల నిర్వాకం శ్రీలంక సర్వ నాశనం
గోటబోయ..మహీంద రాజపక్సేలపై ఆగ్రహం
Sri Lanka Crisis : ఇవాళ ద్వీప దేశం శ్రీలంక అట్టుడుకుతోంది. రాచరికపు పాలనను గుర్తుకు తెచ్చేలా చేసిన ఘనత గోటబోయ రాజపక్సే, మహీంద రాజపక్సేలదే.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత, పెట్రోల్ డీజిల్ కొరత, విద్యుత్ సరఫరాలో అంతరాయం, గ్యాస్ అందు బాటులో లేక పోవడానికి ప్రధాన కారణంగా ఈ ఇద్దరి నిర్వాకం వల్లనే జరిగిందన్నది బహిరంగ రహస్యం.
జనం రోడ్లపైనే రోజుల తరబడి నిరీక్షించేలా చేశారు. చివరకు తామే తప్పు కోవాల్సి వచ్చింది. ప్రజల ఆగ్రహావేశాలకు రాజ సౌధం కూలి పోయింది. తమ్ముడు ప్రధానమంత్రిగా కొలువు తీరిన మహీంద దెబ్బకు రాజీనామా చేసి ఆర్మీ క్యాంపులో తల దాచుకున్నాడు.
పరిస్థితి కంట్రోల్ లోకి తీసుకు వచ్చేందుకు ప్రెసిడెంట్ గా ఉన్న గోటబయ తన తమ్ముడిని తప్పించి మాజీ ప్రధాన మంత్రి రణిలె విక్రమ సింఘేకు పీఎంగా చాన్స్ ఇచ్చాడు.
అయినా కొంత మేరకు ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. సంక్షోభం నుంచి శ్రీలంక(Sri Lanka Crisis) ను గట్టెక్కించ లేక పోయారు.
దీంతో విపక్షాల ఆందోళనలు, ప్రజల నిరసనల మధ్య ఒక్కసారిగా లక్షలాదిగా తరలి వచ్చారు.
ఆపై అధ్యక్షుడి భవనంపై దాడికి పాల్పడ్డారు. దీంతో గోటబోయ రాజపక్సే భవనం విడిచి పరారయ్యాడు. అక్కడి నుంచి ఓడ ద్వారా ఇతర దేశాలకు చెక్కేశాడు.
ఇక మహీంద రాజపక్సే పరిస్థితి ఎక్కడుందో తెలియదు. శ్రీలంకకు(Sri Lanka Crisis) ప్రధాన ఆదాయ వనరు టీఆకు. అది కూడా బంద్ అయ్యింది. అగ్గిపెట్టె నుంచి ప్రతిదీ ఇతర దేశాలపై ఆధారపడడం ఆ దేశానికి అలవాటుగా మారింది.
విదేశీ మారక నిల్వలు లేక పోవడం శాపంగా మారింది. ఏ దేశం అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. వారి అవసరాలను గమనించిన చైనా శ్రీలంకను
తనకు దాసోహం చేసుకునేలా చేసింది.
దెబ్బకు ఇవాళ ఇలా తయారవడానికి ప్రధాన కారణం డ్రాగన్ . అన్నదమ్ములు ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం ఆ దేశానికి శాపంగా మారింది.
2018లో రణిల్ విక్రమసింఘే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో సోదరుడిని తీసుకు వచ్చాడు గోటబోయ. అతడు వచ్చాక పూర్తిగా
బీజింగ్ వైపు మళ్లాడు.
చైనాకు దాసోహం అన్నాడు. అతడి చర్యలు దేశానికి విరుద్దంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది.
Also Read : లంకలో ఉద్రిక్తం పీఎం ఇంటికి నిప్పు