Sanath Jayasuriya : శ్రీలంక పర్యాటక ప్రచారకర్తగా జయసూర్య
ఉత్తర్వులు జారీ చేసిన శ్రీలంక సర్కార్
Sanath Jayasuriya : శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్యకు కీలకమైన పదవి దక్కింది. ప్రస్తుతం ఆ దేశం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ప్రజల తరపున పోరాడిన వారందరికీ జయసూర్య మద్దతు పలికారు. దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్సే తప్పు కోవాలని డిమాండ్ చేశారు. దేశం సర్వ నాశనం కావడానికి ఆయనే కారణమంటూ ఎలుగెత్తి చాటారు.
చివరకు గోటబయ తన భవనం విడిచి పెట్టాడు. ఆపై సింగపూర్ కు చెక్కేశాడు. అనంతరం జరిగిన ఎన్నికల్లో రణిలె విక్రమసింఘే విజయం సాధించారు. దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కీలక నిర్ణయాలు తీసుకుంటూ శ్రీలంకను సంక్షోభం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఇల్లు లేదని తనను పదవి నుంచి తొలగి పోవాలని కోరడం భావ్యం కాదన్నారు.
సింఘే సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన పర్యాటక రంగానికి ఉత్తేజం తీసుకు రావాలని సంకల్పించింది.
ఇందులో భాగంగా దేశ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడిగా పేరొందారు సనత్ జయసూర్య(Sanath Jayasuriya). ఈ మేరకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జయసూర్యను శ్రీలంక టూరిజం (పర్యాటక) ప్రచారకర్తగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సనత్ మాట్లాడారు.
శ్రీలంకలోని హిందూ దేవాలయాలు, ఇతర హిందూ పర్యాటక ప్రదేశాలను అభివృద్ది చేస్తానని చెప్పారు. పర్యాటక ప్రదేశాలపై ఎక్కువగా ఫోకస్ పెడతానని చెప్పారు సనత్ జయసూర్య. సానుకూల దృక్ఫథంతో ఉండేలా చర్యలు ఉంటాయన్నారు.
Also Read : పీవీ సింధు ఆట తీరుకు వార్నర్ ఫిదా