Sri Sri Ravishankar : దేశానికి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం అవ‌స‌రం

ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు ర‌వి శంక‌ర్

Sri Sri Ravishankar : ప్ర‌ముఖ ఆధ్యాత్మిక‌వేత్త‌, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గ‌తంలో ఆయ‌న ఎన్న‌డూ రాజ‌కీయాల జోలికి వెళ్ల‌లేదు.

కానీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొలాని, స‌త్ సంబంధాలు ఉండాల‌ని కోరుతూ రాయ‌బారం నెరిపారు. ఈ త‌రుణంలో భార‌త దేశంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామ‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఆ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి రాజ‌కీయ వ‌ర్గాల‌లో. ఏ దేశంలోనైనా ప్ర‌జాస్వామ్యం బాగుండాలంటే అధికార‌ప‌క్షంతో పాటు బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం కూడా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

లేక పోతే అది డెమోక్ర‌సీ అనిపించుకోద‌ని ర‌విశంక‌ర్(Sri Sri Ravishankar) ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం భార‌త్ లో అధికారం బ‌లంగా ఉంద‌ని. కానీ ప‌టిష్టంగా ఉండాల్సిన ప్ర‌తిప‌క్షం బ‌ల‌హీనంగా మారింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

దీని వ‌ల్ల ప్ర‌జ‌ల త‌ర‌పున మాట్లాడే వాయిస్ లేకుండా పోతుంద‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు ర‌విశంక‌ర్(Sri Sri Ravi shankar). ఆరోగ్య‌క‌ర‌మైన డెమోక్ర‌సీ కావాలంటే దేశంలో ప‌టిష్ట‌వంత‌మైన‌, నిర్మాణాత్మ‌క‌మైన పాత్ర పోషించే ప్ర‌తిప‌క్షం త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

అప్పుడే ప్ర‌జ‌ల వాయిస్ కు వినిపించే చాన్స్ ఉంటుంద‌న్నారు. ఇది ఎంత బ‌ల‌ప‌డితే అంత బెట‌ర్ అని పేర్కొన్నారు శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ(Sri Sri Ravishankar). ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షం అత్యంత బ‌ల‌హీనంగా ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ దేశంలో తాను డెమోక్ర‌సీ ఉంద‌ని అనుకోవ‌డం లేద‌న్నారు. దేశంలో న్యాయ వ్య‌వ‌స్థ బ‌లంగా ఉంద‌న్నారు.ప్ర‌తిప‌క్షం స‌రిగా లేక పోవ‌డంతో నిరంకుశ‌త్వంలా క‌నిపిస్తోందంటూ ఘాటు కామెంట్స్ చేశారు.

 

Also Read : టీటీడీ ఇంచార్జ్ ఈవోగా ధ‌ర్మారెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!