TTD Vaibhavotsavam : అక్టోబ‌ర్ 11 నుంచి శ్రీవారి వైభ‌వోత్స‌వాలు

హైద‌రాబాద్ లో ఘ‌నంగా ఏర్పాట్లకు శ్రీ‌కారం

TTD Vaibhavotsavam : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలోని అన్ని దేవాల‌యాల‌లో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలోని హైద‌రాబాద్ లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో వ‌చ్చే నెల అక్టోబ‌ర్ 11 నుంచి వైభ‌వ ఉత్స‌వాలు నిర్వ‌హించాల‌ని టీటీడీ నిర్ణ‌యించింది.

ఐదు రోజుల పాటు నిర్వ‌హించ‌నున్నారు. టీటీడీ జేఈఓ వీర‌బ్ర‌హ్మం ఉత్స‌వాల విశేషాల‌ను తెలియ చేశారు. వ‌ర్చువ‌ల్ గా స‌మీక్ష చేప‌ట్టారు.

ఇక ప్ర‌తి నిత్యం తిరుమ‌ల‌లో జ‌రిపే నిత్య‌, వార సేవ‌లు , ఉత్స‌వాల‌ను చూసే భాగ్యం క‌ల‌గ‌ని భ‌క్తుల‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాల ద్వారా ద‌ర్శించుకునే భాగ్యం క‌లుగుతుంద‌న్నారు జేఈఓ.

ఈ ఉత్స‌వాల గురించి ప‌ది రోజుల కంటే ముందే విస్తృతంగా ప్ర‌చార ర‌థాల ద్వారా ప్ర‌చారం చేయాల‌ని ఆదేశించామ‌న్నారు. ఇందుకు సంబంధించి ఎన్టీఆర్ స్టేడియంలో స్వామి వారి వైభ‌వోత్స‌వ వేదిక‌తో(TTD Vaibhavotsavam) పాటు స్టేడియం మొత్తం పుష్పాలంక‌ర‌ణ‌, విద్యుత్ అలంక‌ర‌ణ‌, ఫ్లెక్సీలు, ఆర్చిల నిర్మాణాలు కూడా చేప‌ట్టాల‌న్నారు.

భ‌క్తులు ఎక్కువగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని పెద్ద ఎత్తున ఎల్ఈడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయాల‌న్నారు జేఈఓ. అన్న ప్ర‌సాదాల పంపిణీ, ర‌వాణా , వ‌స‌తి, ఛాయా చిత్ర ప్ర‌ద‌ర్శ‌న కూడా ఉండాల‌న్నారు.

అంతే కాకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల విక్ర‌య కౌంట‌ర్లు కూడా విరివిగా ఏర్పాటు చేయాల‌ని, టీటీడీ స‌మాచారం అందుబాటులో ఉంచేలా చూడాల‌ని ఆదేశించారు జేఈఓ వీర‌బ్ర‌హ్మం.

తిరుమ‌ల ప్రాశ‌స్త్యాన్ని తెలియ చేసే విధంగా ఏర్పాట్లు ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్తులు

Leave A Reply

Your Email Id will not be published!