Srinivas Goud : మహబూబ్ నగర్ – కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదన్నారు రాష్ట్ర ఎక్సైజ్, ఆబ్కారీ , సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud). ఎన్నికల ప్రచారంలో భాగంగా బొక్కలోని పల్లి గ్రామంలో ప్రసంగించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎక్కడా దేశంలో అమలు కావడం లేదన్నారు.
Srinivas Goud Slams Congress
నీతి, నిజాయితీ లేని వాళ్లు ఎన్ని శుష్క వాగ్ధానాలు, హామీలు చేసినా జనం నమ్మరని అన్నారు. బీఆర్ఎస్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఈ 75 ఏళ్ల కాలంలో ఉమ్మడి ఏపీకి ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్నారు. ఇవాళ తాను గెలుపొందిన తర్వాతనే పెద్ద ఎత్తున అభివృద్ది పేరుతో నిధులు తీసుకు వచ్చానని చెప్పారు శ్రీనివాస్ గౌడ్.
అణగారిన వర్గాలకు అండగా ఉండే తాను కావాలా లేక దొరకు, రెడ్డికి ఊడిగం చేసే రెడ్డి కావాలో తేల్చు కోవాలన్నారు . ఎవరి స్థాయి ఏమిటో తెలుసుకుని మాట్లాడాలన్నారు.
మొత్తం 119 స్థానాలకు గాను తమ బీఆర్ఎస్ పార్టీకి కనీసం 80 సీట్లకు పైగా వస్తాయని ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని జోష్యం చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇదిలా ఉండగా దాడులకు దిగాలని చూస్తే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు.
Also Read : Niranjan Reddy : దోపిడీకి చిరునామా కాంగ్రెస్