Srisailam Dam: శ్రీ శైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు !
శ్రీ శైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణమ్మ పరవళ్లు !
Srisailam Dam: మహరాష్ర్ట, తెలంగాణ కు భారీ వర్షాలతో శ్రీ శైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీ శైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మూడు గేట్లను 10 అడుగుల మేర గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం 3గంటల సమయానికి శ్రీ శైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 878.90 అడుగులు వరకు ఉన్నాది.
Srisailam Dam Gates…
కృష్ణ నదికి వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో శ్రీ శైలం డ్యాం మూడు గేట్లను ఎత్తిన కర్నూలు చీఫ్ ఇంజినీర్ కబీర్ బాషా.. శ్రీ శైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 182.61 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో 4,67,210 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 82,738 క్యూసెక్కులుగా ఉంది. ఒక్కో గేటు నుంచి 27వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదలైంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కడాన్ని వీక్షించేందుకు సందర్శకులు పోటేత్తున్నారు.
Also Read : GST Scam : జీఎస్టీ అవకతవకలపై తెలంగాణ అసెంబ్లీలో కీలక చర్చ