Manipur Violence : మణిపూర్ హింసపై మౌనమేల
యుఎన్ హెడ్ క్వార్టర్స్ వద్ద ప్రదర్శన
Manipur Violence : మణిపూర్ లో చోటు చేసుకున్న హింసకు 90 రోజులు పూర్తయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీకి చెందినవే అయినప్పటికీ ఇప్పటి వరకు హింసను, అల్లర్లను అదుపులోకి తీసుకు రాలేక పోయాయి. సమస్యను పక్కదారి పట్టించేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించాయి ప్రతిపక్షాలు. ఏకంగా పార్లమెంట్ ఈ అంశంపై స్తంభించి పోయింది. అయినా బాధ్యత కలిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడంపై మండిపడుతున్నారు విపక్ష పార్టీల నేతలు.
Manipur Violence Viral on World
ప్రత్యేకించి రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావించారు. ఆయన స్వయంగా మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించారు. అక్కడి వారితో మాట్లాడారు. బాధిత పిల్లలతో కలిసి టిఫిన్ కూడా చేశారు. దేశ ప్రజలకు కావాల్సింది ప్రేమ కానీ ద్వేషం కాదని ఈ మేరకు స్పష్టం చేశారు. కానీ మోదీ మౌనం వీడలేదు.
తాజాగా అమెరికాలో మణిపూర్ హింసను(Manipur Violence) వెంటనే ఆపాలని, ప్రధాన మంత్రి మోదీ మౌనం వీడాలని కోరుతూ ఏకంగా వాహనం ద్వారా ప్రచారం చేస్తుండడం విశేషం. ప్రత్యేకించి అమెరికాలోని ఐక్య రాజ్య సమితి కార్యాలయం ముందు దీనిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. కానీ ఇంత జరిగినా పీఎం ఎందుకు ఇంకా స్పందించడం లేదన్నది చర్చకు దారి తీసింది.
Also Read : Gruhalakshmi Scheme : గృహలక్ష్మి దరఖాస్తుల స్వీకరణ