Suicide Attack Army Camp : ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడి
ముగ్గురు సైనికుల వీర మరణం
Suicide Attack Army Camp : దేశంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ ఉగ్రవాదులు పంజా విసరడం మాత్రం మానడం లేదు. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి లో ఆర్మీ క్యాంపుపై గురువారం ఆత్మాహుతి దాడికి(Suicide Attack Army Camp) పాల్పడ్డారు.
క్యాంపు లోకి జొరబడ్డారు. దీంతో ఆర్మీ క్యాంపులో ఉన్న ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. దీంతో వెంటనే తీరుకున్న ఆర్మీ అలర్ట్ అయ్యింది.
భద్రతా దళాలు ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టింది. రాజౌరికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్హాల్ పోలీస్ స్టేసన్ పరిధిలోని పర్గల వద్ద ఉన్న ఆర్మీ క్యాంపు లోకి చొరబడేందుకు యత్నించారు.
ఈ దాడిలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు జమ్మూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందన్నారు.
ఘటన తెలిసిన వెంటనే అదనపు బలగాలను మోహరించారు. ఆ ప్రాంతమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. బుద్ కనాడి సమీపంలో ఏర్పాటు చేశారు ఆర్మీ క్యాంపు.
అయితే కంచెను దాటేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. వారికి చికిత్స జరుగుతోందన్నారు సింగ్. ఈ ఘటన తెల్ల వారుజామున 3.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా ఘటన జరిగిన విషయంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరా తీసింది. పరిస్థితి గురించి వాకబు చేసింది. ఘటన అనంతరం ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు బలగాలు.
Also Read : ‘జెండా’ను కూడా అమ్మకానికి పెట్టారా