Sundar Pichai Sold House : చెన్నైలో ఇల్లు అమ్మేసిన పిచాయ్
కొనుగోలు చేసిన నిర్మాత సి. మణికందన్
Sundar Pichai Sold House : గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ తాను పుట్టి పెరిగిన ఇంటిని చెన్నైలో అమ్మేశాడు(Sundar Pichai Sold House). ఈ విషయం విస్తు పోయేలా చేసింది. కోట్లాది రూపాయలు కలిగిన సిఇఓ ఉన్నట్టుండి తను పెరిగిన ఇంటిని అమ్మడం కలకలం రేపింది. పిచాయ్ ఇంటిని తమిళ నటుడు, నిర్మాత సి. మణికందన్ కు విక్రయించారు.
అయితే ఆస్తి అప్పగింత సమయంలో తండ్రి కూలి పోయాడని సమాచారం. ఈ ఇల్లు చెన్నై లోని నివాస ప్రాంతమైన అశోక్ నగర్ లో ఉంది. మణికందన్ కు సంబంధించి మొదటి ఆస్తి అవుతుంది. మణికందన్ ఏదైనా కొనుగోలు చేయాలని అనుకున్నాడు. ఈ తరుణంలో సుందర్ పిచాయ్ పుట్టి పెరిగిన ఇల్లు అమ్మకానికి ఉందని తెలుసుకుని సంతోషం పడ్డాడు. ఆ వెంటనే దానిని కొనుగోలు చేయాలని అనుకున్నాడు.
సుందర్ పిచాయ్ మన దేశం గర్వపడేలా చేశాడు. అతను నివసించిన ఇంటిని కొనుగోలు చేయడం నా జీవితంలో గర్వించదగిన విజయం అని పేర్కొన్నాడు నటుడు, నిర్మాత మణికందన్. స్వయంగా రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన మణికందన్ దాదాపు 300 ఇళ్లను నిర్మించారు. ఈ సందర్బంగా గూగుల్ సిఇఓ తల్లిదండ్రుల వినయం తనను కలిసి వేసిందని చెప్పాడు. పిచాయ్ తండ్రి రిజిస్ట్రేషన్ ఆఫీసులో గంటల తరబడి వేచి ఉన్నారు. పత్రాలు ఇచ్చే కంటే ముందు అన్ని పన్నులు చెల్లించాడని తెలిపాడు.
Also Read : Supreme Court Panel