Sunil Gavaskar : సెలెక్టర్ అయితే కార్తీక్ ను ఎంపిక చేస్తా
మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కామెంట్స్
Sunil Gavaskar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్(Sunil Gavaskar) అలియాస్ సన్నీ సంచలన కామెంట్స్ చేశారు. తానే గనుక బీసీసీఐ సెలెక్టర్ అయితే దినేష్ కార్తీక్ ను రాబోయే టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేసి ఉండేవానని పేర్కొన్నాడు.
ప్రస్తుతం సన్నీ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడుతున్నాడు కార్తీక్. ఆ జట్టు విజయాలలో కీలక భూమిక పోషించాడు.
ప్రధానంగా ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్ లో తాను ఆడాలని అనుకుంటున్నట్లు తన అభిప్రాయాన్ని తెలియ చేశాడు.
భారత్ జట్టుకు టైటిల్ తీసుకు రావాలన్నదే తన సుదీర్ఘమైన కల అని చెప్పాడు దినేష్ కార్తిక్. ప్రధానంగా బ్యాటర్ గానే కాకుండా వికెట్ కీపర్ గా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడి ఆట తీరును చూసి తాజా, మాజీ ఆటగాళ్లు సైతం విస్తు పోయారు.
ఇదిలా ఉండగా గత ఏడాది సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) తో దినేష్ కార్తీక్ కామెంటరీ బాక్సులో చాలా సమయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో కార్తీక్ ఫామ్ ను పరిగణలోకి తీసుకుని వచ్చే టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయాలని కోరాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar).
గత ఏడాది ఇంగ్లండ్ లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో మేమిద్దరం పాలు పంచుకున్నాం. క్వారంటైన్ లో ఉన్న సమయంలో కూడా దినేష్ కార్తీక్ కు బలమైన కోరిక మిగిలి పోయింది.
అది భారత జట్టుకు టీ20 వరల్డ్ కప్ లో ఆడాలన్న కోరిక . దానిని సెలెక్టర్లు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పాడు సన్నీ.
Also Read : యుజ్వేంద్ర చాహల్ సూపర్