Sunil Jakhar : బీజేపీకి జై కొట్టిన సునీల్ జాఖ‌ర్

కాంగ్రెస్ కు ఇటీవ‌లే గుడ్ బై

Sunil Jakhar : పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖ‌ర్ ఇటీవ‌లే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గుడ్ బై గుడ్ ల‌క్ అంటూ ప్ర‌క‌టించిన ఆయ‌న ఉన్న‌ట్టుండి భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపు మొగ్గు చూపారు.

గురువారం మ‌ధ్యాహ్నం ఆయ‌న కాషాయ కండువా క‌ప్పుకున్నారు. దీంతో సునీల్ జాఖ‌ర్ చేరిక‌తో పంజాబ్ రాష్ట్రంలో బ‌ల‌మైన నాయ‌క‌త్వం కాషాయ పార్టీకి ల‌భించిన‌ట్లైంది.

ఇదిలా ఉండ‌గా పార్టీ వ్య‌తిరేక కార్యకాల‌పాల‌కు పాల్ప‌డుతున్నారంటూ హైక‌మాండ్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌క ముందే ఆయ‌న హై క‌మాండ్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఆపై తానే త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు జాఖ‌ర్. ఇదే స‌మ‌యంలో అన్ని ప‌ద‌వుల నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా మాజీ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీపై,

న‌వ జ్యోత్ సింగ్ సిద్దూపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సునీల్ జాఖ‌ర్(Sunil Jakhar). దీనిపై సంజాయిషీ కోరినా ఆయ‌న ప‌ట్టించు కోలేదు. ఆ పార్టీని వీడాక ఇక రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయంగా ఎదిగేందుకు గాను బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు సునీల్ జాఖ‌ర్.

కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడిగా పేరొందారు. ఒక ర‌కంగా సుదీర్ఘ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన ఆ పార్టీ నుంచి ఒక్క‌రొక్క‌రు పార్టీని వీడుతున్నారు.

తాజాగా గుజ‌రాత్ రాష్ట్రంలో ప‌టేదార్ వ‌ర్గానికి నాయ‌కుడిగా ఉన్న హార్దిక ప‌టేల్ రాజీనామా చేశారు. ఆయ‌న కూడా రేపో ఎల్లుండో బీజేపీలో చేరే చాన్స్ ఉంద‌ని స‌మాచారం. మొత్తంగా బీజేపీ ఆక‌ర్ష్ మంత్రం కాంగ్రెస్ ను బ‌ల‌హీన ప‌ర్చేలా ఉంది.

Also Read : ఆజం ఖాన్ కు మ‌ధ్యంత‌ర బెయిల్

Leave A Reply

Your Email Id will not be published!