Sunil Jakhar : కాంగ్రెస్ కు సునీల్ జాఖర్ రాజీనామా
పంజాబ్ కాంగ్రెస్ కు బిగ్ షాక్
Sunil Jakhar : సుదీర్గ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కీలకమైన నాయకులు ఒక్కరొక్కరుగా వీడి పోతున్నారు.
ఇటీవలే షోకాజ్ నోటీసు అందుకున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు సునీల్ జాఖర్(Sunil Jakhar) తాను పార్టీని వీడుతున్నట్లు శనివారం ప్రకటించారు.
ఈ మేరకు గుడ్ బై గుడ్ లక్ కాంగ్రెస్ అంటూ పేర్కొన్నారు. పార్టీని తాను విడిచి పెడుతున్నట్లు స్పష్టం చేశాడు. ఇక నుంచి తనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు సునీల్ జాఖర్(Sunil Jakhar) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన పంజాబ్ సీఎంగా ఉన్న చరణ్ జిత్ సింగ్ చన్నీపై నోరు పారేసుకున్నారు.
పలువురి ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని ప్రకటించారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న నవ జ్యోత్ సింగ్ సిద్దూ పై కూడా ఆరోపణలు చేశారు. ఆపై పార్టీ హై కమాండ్ ను తప్పు పట్టారు.
పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయకత్వం కొరవడిందంటూ ఆరోపించారు. ఈ తరుణంలో పార్టీకి చన్నీ అనుచరులు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో సునీల్ జాఖర్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది పార్టీ.
ఇంత లోనే ఆయన ఎలాంటి వివరణ ఇవ్వకుండానే తాను పార్టీని వీడుతున్నట్లు డిక్లేర్ చేసి అందరినీ విస్తు పోయేలా చేశారు.
ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ నవ సంకల్ప్ చింతన్ శివిర్ పేరుతో సదస్సు ఏర్పాటు చేసింది.
ఇవాళ రెండో రోజు. ఇదే సమయంలో మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేరళకు చెందిన మాజీ కేంద్ర మంత్రి థామస్ ను పరా్టీ నుంచి బహిష్కరించింది.
Also Read : హిందీ భాషను గౌరవించండి