Sunil Kanugolu : తెలంగాణ – ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, కర్ణాటక ప్రభుత్వ సలహాదారు సునీల్ కనుగోలు హాట్ టాపిక్ గా మారారు. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఉన్నవి కొన్ని రోజులే. రోజు రోజుకు ఆయా పార్టీలన్నీ తమ తమ ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి.
Sunil Kanugolu Viral
ఈసారి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ఉందని, దానిని ఎన్ క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్(Congress) పార్టీ ఫోకస్ చేస్తోంది. ప్రచార కర్తగా, వ్యూహకర్తగా కాంగ్రెస్ పార్టీకి కీలకంగా వ్యవహరిస్తున్నారు సునీల్ కనుగోలు. ఈ మేరకు మరింత ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లడం, ఆయా నియోజకవర్గాలలో వ్యూహాలను అమలు చేయడం , ఓటర్లను ప్రభావితం చేసేందుకు గాను 300 మంది టీమ్ తో హైదరాబాద్ లోకి ఎంటరైనట్లు సమాచారం.
వార్ రూమ్ టీమ్ తెలంగాణలోని పార్టీ గాంధీ భవన్ లోకి ప్రవేశించినట్లు టాక్. ఒక్కో బృందానికి ఒకరు లీడర్ గా ఉంటారు. ఇందులో 10 మంది సభ్యులు, 30 జట్లు మొత్తం 300 మందితో మానిటరింగ్ నిర్వహించనున్నారు సునీల్ కనుగోలు.
Also Read : Tirumala Rush : శ్రీవారి ఆదాయం రూ. 4.87 కోట్లు