Abhishek Banerjee : దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఊరట
విచారించేందుకు ఈడీకి పర్మిషన్
Abhishek Banerjee : పశ్చిమ బెంగాల్ లో జరిగిన బొగ్గు కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు తనను ఢిల్లీలో కాకుండా కోల్ కతాలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నించాలని కోరుతూ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పంది.
ఎంపీని విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు అనుమతి ఇచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించాలని, రాష్ట్రంలో ఉన్నప్పుడు వారికి రక్షణ కల్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
అభిషేక్ బెనర్జీని(Abhishek Banerjee) రాష్ట్ర రాజధాని కోల్ కతాలో ప్రశ్నించేందుకు కనీసం 24 గంటల ముందు దర్యాప్తు సంస్థ తెలియ చేయాలని ఆదేశించింది.
బెంగాల్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఏదైనా అడ్డంకిగా మారినా లేదా ఎలాంటి ఆటంకాలు కల్పించినా, జోక్యం చేసుకున్నా సహించ బోమంటూ జస్టిస్ యూయూ లలిత్ తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఈడీ తన ప్రధాన కార్యాలయంలో కాకుండా తన సొంత రాష్ట్రంలోనే ప్రశ్నించాలని అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee) కోరారు.
టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు సీఎం సైతం కేంద్ర ప్రభుత్వం కావాలనే బీజేపీయేతర వ్యక్తులను, పార్టీలను టార్గెట్ చేస్తోందంటూ ఆరోపించారు.
తాము జారీ చేసిన సమన్లకు సమాధానం ఇవ్వనందుకు ఈడీ చేసిన ఫిర్యాదుపై అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీపై ఢిల్లీ కోర్టు జారీ చేసిన బెయిలబుల్ వారెంట్ పై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది. బొగ్గు కుంభకోణంలో ఆమె కూడా ఒకరుగా ఉన్నారు.
Also Read : ఓవైసీ కామెంట్స్ స్వామి సీరియస్