Super Novas T20 : అబ్బా సూపర్ నోవాస్ దెబ్బ
49 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ
Super Novas T20 : ఒ వైపు ఐపీఎల్ 2022 హీట్ పుట్టిస్తుండగా మరో వైపు మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీ ఫుల్ జోష్ నింపుతోంది. పుణె వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో సూపర్ నోవాస్ డిఫెండింగ్ ఛాంపియన్ ట్రైల్ బ్లేజర్స్ ను మట్టి కరిపించింది.
ఏకంగా 49 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ లో భాగంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ లోని సూపర్ నోవాస్(Super Novas T20) నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
కెప్టెన్ కౌర్ 4 ఫోర్లతో 37 రన్స్ చేసింది. ఇక హర్లిన్ డియోల్ 5 ఫోర్లతో 35, డాటిన్ 5 ఫోర్లు ఒక సిక్సర్ తో 32 , ప్రియా పునియా 22 పరుగులతో రాణించారు. సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు సూపర్ నోవాస్.
ఇక ప్రత్యర్థి బ్లేజర్స్ బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్ సత్తా చాటింది. మూడు కీలక వికెట్లు తీసింది. ఇక 161 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ట్రైల్ బ్లేజర్స్ ఏ మాత్రం ధీటుగా ఆడ లేక పోయింది.
నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 114 పరుగులే చేసి చతికిల పడింది. కెప్టెన్ స్మృతి మందన 34 పరుగులు చేసి రాణించగా జెమీమా 24, హేలీ 18, రేణుక సింగ్ మాత్రమే రన్స్ చేశారు.
దీంతో 49 పరుగుల భారీ తేడాతో సూపర్ నోవాస్(Super Novas T20) కోలుకోలేని షాక్ ఇచ్చింది మందనకు. ఇక సూపర్ నోవాస్ బౌలర్లు పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు.
పూజా వస్ ర్తాకర్ ఏకంగా 4 వికెట్లు పడగొట్టింది. సోఫీ, అలనా కింగ్ తలో రెండు వికెట్లు తీశారు. నోవాస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read : గుజరాత్ రాజస్తాన్ నువ్వా నేనా