Kamal Haasan : కాంగ్రెస్..డీఎంకే కూటమికి మద్దతు – కమల్
ప్రకటించిన ఎంఎన్ఎం చీఫ్
Kamal Haasan : ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్(Kamal Haasan) సంచలన ప్రకటన చేశారు. ఆయన కాంగ్రెస్ – డీఎంకే ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. తాను ఎందుకు ఎంపీ కాకూడదని ప్రశ్నించారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పిన కమల్ హాసన్ తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ సీటు ఆశించ కూడదంటూ ప్రశ్నించారు.
నేను ఎందుకు కాకూడదు. దేశ ప్రయోజనాల కోసం మేం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ నుండి ఎంపీ సీటు వస్తుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు కమల్ హాసన్. గత నెలలో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి కమల్ కూడా ప్రస్తావనకు తెచ్చారు.
జనవరి 23న తన అల్వార్ పేట కార్యాలయంలో ఎలంగోవన్ ని కలుసుకుని ఉప ఎన్నికలకు మద్దతు కోరిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎంఎన్ఎం కార్యవర్గ సభ్యులతో చర్చించిన తర్వాత కమల్ హాసన్(Kamal Haasan) కాంగ్రెస్, డీఎంకే అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇది పార్టీ కలిసి తీసుకున్న నిర్ణయం . ఇదే మద్దతు వచ్చే 2024 ఎన్నికల వరకు కొనసాగుతుందా అన్న ప్రశ్నకు కమల్ హాసన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇంకా దానికి టైం ఉందన్నారు. గతంలో ఆయన డీఎంకేపై ఆరోపణలు చేశారు. కానీ ఉన్నట్టుండి స్వరం మార్చారు.
Also Read : అపరిపక్వతతో కూడుకున్న నిర్ణయం – థరూర్