Joe Biden : శాశ్వత సభ్యత్వం కోసం భారత్ కు మద్దతు
ప్రకటించిన అమెరికా దేశ అధ్యక్షుడు బైడెన్
Joe Biden : అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
శాశ్వత, శాశ్వత ప్రతినిధుల సంఖ్యను పెంచేందుకు తాము సపోర్ట్ చేస్తామన్నారు. యుఎన్ భద్రతా మండలిని సంస్కరించేందుకు బైడెన్ తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఇదిలా ఉండగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా జర్మనీ, జపాన్, భారత్ కు బైడెన్ సపోర్ట్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ విషయంలో చాలా పని చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. జర్మనీ, జపాన్, ఇండియా సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్యులుగా ఉండాలనే ఆలోచన వెనుక తాము కచ్చితంగా నిలబడి ఉంటామని స్పష్టం చేశారు.
ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగంలో భద్రతా మండలిని సంస్కరించేందుకు తన నిబద్దతను పునరుద్ఘాటించారు అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్.
ప్రపంచ అవసరాలకు మెరుగ్గా ప్రతిస్పందించేలా సంస్థ మరింత సమగ్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైందని బైడెన్(Joe Biden) అన్నారు. అమెరికాతో సహా యుఎన్ భద్రతా మండలి సభ్యులు ఐక్యరాజ్యసమితి చార్టర్ ను నిలకడగా సమర్థించాల్సిన అవసరం ఉందన్నారు.
అసాధారణమైన పరిస్థితులలో మినహా వీటోను ఉపయోగించకుండా ఉండాలన్నారు జోసెఫ్ బైడెన్. తాము చాలా కాలంగా మద్దతు ఇస్తున్న దేశాలకు శాశ్వత సీట్లు ఇందులో ఉన్నాయన్నారు.
ఒక రకంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికా తీసుకున్న అసాధారణ నిర్ణయంగా పేర్కొనవచ్చు.
Also Read : పాకిస్తాన్ విపత్తు ప్రపంచానికి హెచ్చరిక – జోలీ