Supreme Court Agrees : గ్యాంగ్ స్ట‌ర్ల హ‌త్య‌పై విచార‌ణ‌కు ఓకే

స్ప‌ష్టం చేసిన స‌ర్వోన్న‌త న్యాయ స్థానం

Supreme Court Agrees : గ్యాంగ్ స్ట‌ర్ గా మారిన రాజ‌కీయ నాయ‌కుడు అతిక్ అహ్మ‌ద్ , సోద‌రుడు అష్ర‌ఫ్ అహ్మ‌ద్ ల‌ను ప్ర‌యాగ్ రాజ్ లో దారుణంగా కాల్చ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ చేసిన అభ్య‌ర్థ‌న‌ను వినేందుకు సుప్రీంకోర్టు(Supreme Court Agrees) అంగీక‌రించింది. యూపీలో జ్యుడీషియ‌ల్ కు వెలుప‌ల జ‌రిగిన హ‌త్య‌ల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని పిటిష‌న్ లో కోరారు. ఈ కేసు ఏప్రిల్ 24న విచార‌ణ‌కు రానుంది.

జైలు నుంచి వైద్య ప‌రీక్ష‌ల కోసం ప్ర‌యోగ్ రాజ్ కు వ‌స్తుండ‌గా మీడియాతో మాట్లాడుతున్న స‌మ‌యంలో విలేక‌రుల ముసుగులో వ‌చ్చిన ముగ్గురు షూట‌ర్లు పాయింట్ బ్లాంక్ తో కాల్చారు. అతిక్, అష్ర‌ఫ్ ల చేతులకు సంకెళ్లు ఉన్నాయి. యూపీలో లా అండ్ ఆర్డ‌ర్ లేకుండా పోయింద‌ని పిటిష‌న‌ర్ ఆరోపించారు.

ఏప్రిల్ 13న యూపీలోని ఝాన్సీలో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో పోలీసులు కాల్చి చంపిన ఇద్ద‌రిలో అతిక్ అహ్మ‌ద్ కుమారుడు అస‌ద్ అహ్మ‌ద్ , స‌హ‌చ‌రుడు గులాం ను ఎన్ కౌంట‌ర్ లో కాల్చి చంపారు. ఈ హ‌త్యుల‌పై విచార‌ణ జ‌రిపేందుకు స్వ‌తంత్ర నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

2017 నుండి జ‌రిగిన 183 ఎన్ కౌంట‌ర్ల‌పై విచార‌ణ‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి అధ్య‌క్ష‌త‌న స్వతంత్ర నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని కోరారు.

Also Read : నోరు పారేసుకుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

Leave A Reply

Your Email Id will not be published!