Supreme Court Gets : ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల ప్ర‌మాణం

జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా..వెంక‌ట‌రామ‌న్ విశ్వ‌నాథ‌న్

Supreme Court Gets : భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో కొత్త‌గా మ‌రో ఇద్ద‌రు న్యాయ‌మూర్తులు కొలువు తీరారు. ఇటీవ‌లే ఇద్ద‌రు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఇప్ప‌టి వ‌ర‌కు సుప్రీంకోర్టులో 34 మంది ఉండ‌గా 32కి త‌గ్గింది. భారీ ఎత్తున కేసులు పేరుకు పోవ‌డంతో గ‌త కొంత కాలం నుండి న్యాయ‌మూర్తుల‌ను భ‌ర్తీ చేయాల‌ని కోరుతూ కొలీజియం సిఫార‌సు చేసింది కేంద్ర ప్ర‌భుత్వానికి. కానీ ఒప్పుకోలేదు. చివ‌ర‌కు సీజేఐగా కొలువు తీరిన ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో దిగి వ‌చ్చింది కేంద్రం.

తాజాగా ఏపీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, సీనియ‌ర్ న్యాయ‌వాది వెంక‌ట‌రామ‌న్ విశ్వ‌నాథ‌న్ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో న్యాయ‌మూర్తులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరితో సీజేఐ చంద్ర‌చూడ్ ప్ర‌మాణం చేయించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ముగ్గురు న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ కేఎం జోసెఫ్‌, జ‌స్టిస్ అజ‌య్ ర‌స్తోగి, జ‌స్టిస్ వి . రామ‌సుబ్ర‌మ‌ణియ‌న్ వేస‌వి సెల‌వుల్లోనే ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. తాజాగా న్యాయ‌మూర్తుల ప్ర‌మాణంతో 34 మంది న్యాయ‌మూర్తుల‌తో కూడిన పూర్తి బ‌లాన్ని పొందింది.

ఇక జ‌స్టిస్ దినేష్ మ‌హేశ్వ‌రి, జ‌స్టిస్ ఎంఆర్ షా ల ప‌ద‌వీ విమ‌ర‌ణ‌తో సుప్రీంకోర్టులో ప్ర‌స్తుతం ఉన్న న్యాయ‌మూర్తుల సంఖ్య 34కి ప‌డి పోయింది.

Also Read : NTR Shata Jayanthi

 

Leave A Reply

Your Email Id will not be published!